ఒకప్పుడు  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కానీ, ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్.. మొన్న  జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచినట్లయితే ఆయన తీరు వేరుగా ఉండేది.  ఎమ్మెల్యేగా  గెలిస్తే... కొంత సమయాన్ని రాజకీయాల కోసం.. మరికొంత సమయాన్ని సినిమా కోసం కేటాయించేవాడు. 


కానీ, ఎన్నికల్లో పూర్తిగా ఓడిపోవడంతో.. పవన్ లో కసి పెరిగింది.  ఎక్కడైతే ఓడిపోయామో.. అక్కడి నుంచే గెలవాలని అనుకున్నాడు.  అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. అంతకు ముందు అనుకున్నట్టుగా ఈ సంవత్సరంలోనే పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు.  


ఈ ఐదేళ్ళలో ప్రతి గ్రామానికి వెళ్లి అక్కడి సమస్యలు తెలుసుకొని.. వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేసేందుకు పవన్ మానసికంగా రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇంకా ఎన్నికలకు ఐదేళ్లు ఉన్నది.  సంస్థాగతంగా బలం పెంచుకోవడానికి ఇదే సరైన సమయం.  


అందుకే పవన్ ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారని సమాచారం.  ఏది ఏమైనా పవన్ రాజకీయాల్లోనే ఉండాలని తీసుకున్న స్ట్రాంగ్ డెసిషన్ అందరికి ఆమోదయోగ్యమైనదనేచెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: