ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది. 2014లో 102 స్థానాలు గెలిచిన తెలుగుదేశం పార్టీ ఈ స్థాయిలో ఓటమిపాలవుతుందని ఎవరూ అంచనా వేయలేదు. 23 స్థానాలతో తెలుగుదేశం పార్టీ దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఇంత ఘోర పరాజయాం పొందాటానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి


2014లో టీడీపీ అధికారంలోకి రావడంలో పవన్ కల్యాణ్ ముఖ్య పాత్ర వహించాడు అంతేకాక బీజేపీ కూడా టీడీపీ కు మద్దతునిచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వంలో ఘోరంగా విఫలమైంది. చివరి సంవత్సరంలో ఇచ్చిన హామీలు అమలు చేయటం నాలుగు సంవత్సరాలు పథకాల అమలు కోసం వేచి ఉండటం కూడా టీడీపీ ఓటమికి కారణంగా మారింది.

 

ఇవే కాక జన్మభూమి కమిటీల్లో టీడీపీ వారికే ప్రాధాన్యత ఇవ్వటం కూడా ప్రజల్లో విపరీతమైన వ్యతిరేఖత పెంచింది. ఓటుకు నోటు కేసు చంద్రబాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది. ఐదేళ్ళలో పాలపరమైన అభివృద్ది కూడా లేకపోవటం టీడీపీ ని ఈ స్థాయిలో ఓటమిపాలయ్యేలా చేసింది


మరింత సమాచారం తెలుసుకోండి: