ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతి పథకం పరిస్థితి గందరగోళంలో ఉంది. కొత్త ప్రభుత్వంలో ఈ పథకం గురించి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.ఇంకా ఆ నిర్ణయం రావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలీదు. కస్టమర్ కేర్ ప్రతినిధుల దగ్గర కూడా ఈ పథకం గురించి ఎలాంటి సమాచారం లేదు

 

నిరుద్యోగులు ఒకవేళ నిరుద్యోగ భృతి ఇవ్వలేని పక్షంలో కనీసం ప్రభుత్వ జాబ్ నోటిఫికేషన్స్ ఐనా ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. గ్రామ వాలంటీర్లకు భారీ గా నియామకం చేపట్టబోతున్నప్పటికీ జాబ్ నోటిఫికేషన్స్ వెలువడితే మరింత ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

 

మరికొంత మంది యువత మాత్రం ఈ యువనేస్తం పథకాన్ని కొనసాగిస్తే బాగుంటుందని ఈ పథకం ద్వారా వచ్చే డబ్బులతో పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూలకు హాజరు కావటానికి చదువుకోవటానికి అవసరమైన పుస్తకాలు కొనడానికి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడకతప్పదు

 


మరింత సమాచారం తెలుసుకోండి: