2014 ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసాయి. బీజేపీ మద్దతు కూడా ఈ రెండింటికీ తోడయ్యింది. ఫలితంగా 2014 ఎన్నికల్లో టీడీపీ విజయకేతనం ఎగరవేసింది. 2019 ఎన్నికల్లో టీడీపీ కు ఏ పార్టీ మద్దతు ఇవ్వలేదు. 23 సీట్లతో టీడీపీ ఘోరమైన ఫలితం అందుకుంది

 

ఒకవేళ టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినా రాష్ట్రంలో మాత్రం వైసీపీనే గెలిచేది కానీ వైసీపీకి 151 స్థానాలు మాత్రం వచ్చేవి కావు. ఎందుకంటే చాలా చోట్ల వైసీపీ అభ్యర్థుల మెజారిటీ కంటే జనసేన పార్టీకి వచ్చిన ఓట్లే ఎక్కువ. కాఅట్టి వైసీపీ కొన్ని స్థానాలు మాత్రం గెలిచే అవకాశాలు కోల్పోయి ఉండేది. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయకపోవటం వైసీపీని లాభం చేకూర్చింది.

 

జనసేన పార్టీ పైకి మద్దతు ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడేలా కొన్ని స్థానాల్లో డమ్మీ అభ్యర్థుల్ని నిలబెట్టిందనే ప్రచారం రెండు పార్టీలకు కొంతమేరకు నష్టం మాత్రం కలిగిం చింది. భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు విడివిడిగానే కలిసి పనిచేసే అవకాశం ఉంది. ఈ ఐదేళ్ళలో జనసేన పార్టీ రాష్ట్రంలో భారీగా పుంజుకుంటే మాత్రం నష్టం వైసీపీ కన్నా టీడీపీకే ఎక్కువగా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: