జగన్ జెట్ స్పీడ్ లా దూసుకు పోతున్నాడు. ప్రత్యర్థి పార్టీలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా తనదైన మార్క్ ను పరిపాలనలో చూపిస్తూ దూసుకుపోతున్నారు. ముఖ్యమంత్రిగా ఇలా ప్రమాణస్వీకారం చేశారో లేదో అలా తన జోరు చూపిస్తున్నారు జగన్. పేదలకు మంచి చేయడమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన జగన్, మొదటిరోజు నుంచే ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు.


ఒకే విడతలో మంత్రివర్గ విస్తరణను పూర్తిచేసి, ఇవాళ్టి నుంచి పాలనను పరుగులు పెట్టించబోతున్నారు. మరికాసేపట్లో జరగనున్న తొలి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకొని, అమలు చేయబోతున్నారు సీఎం జగన్. సెక్రటేరియట్ లోని బ్లాక్-1లో ఉన్న కేబినెట్ హాల్ లో ఈరోజు తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది. గడిచిన 5 రోజులుగా తను తీసుకున్న నిర్ణయాల్ని, ఈ కేబినెట్ భేటీలో చర్చిస్తారు జగన్.


వాటిని మంత్రులంతా ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాత వెంటనే అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేస్తారు. ఒకటికాదు, రెండుకాదు.. దాదాపు 10కి పైగా కీలక నిర్ణయాల్ని ఈరోజు తీసుకోబోతున్నారు. అయితే ఇవన్నీ గమనించిన టీడీపీ నేత జగన్ ఇలాగే తన దూకుడు కొనసాగిస్తే కష్టమని, మనం విమర్శలు మొదలు పెట్టాలని లేదంటే వచ్చే సారి కూడా పార్టీ అధికారంలోకి రావటం కష్టమని వ్యాఖ్యానించారు. దీనితో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారంట .. రాజకీయాల్లో నమ్మకం, ఓపిక లేకపోతే వెళ్లిపోండని చెప్పినట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: