మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవన్ కళ్యాన్ హీరోగా మంచి సత్తా చాటుతున్న సమయంలోనే గబ్బర్ సింగ్ సినిమా తర్వాత గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘జనసేన’పార్టీ స్థాపించారు.  ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వస్తున్నా అంటూ అప్పటి ప్రభుత్వం టీాడీపీ, బీజేపీతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూనే విమర్శలు మొదలు పెట్టారు.


దాంతో ఆ రెండు పార్టీలకు తర్వాత దూరమయ్యారు.  ఇక తాను ప్రశ్నించడానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సిందే అంటూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు. అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను నిలిపారు..కానీ ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకున్నారు.  మరీ ట్విస్ట్ ఏంటంటే పవన్ కళ్యాన్ పోటీ చేసిన రెండు స్థానాల్లో దారుణమైన ఫలితం పొందరు.  


ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి తన పార్టీ సభ్యులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.  అయితే ఈ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఎక్కువ జరిగిందని..తాము అలా డబ్బులు వెదజల్లలేకపోయాయని..తమకు వచ్చిన ఓట్లన్నీ స్వచ్ఛమైన మనసున్న వారే వేశారని పవన్ కళ్యాన్ అన్నారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఓటును కొనుగోలు చేయాలన్న ఉద్దేశంతో నాయకులు ఇచ్చే డబ్బును తీసుకోవడం కన్నా, ఓ గుడి ముందు కూర్చుని భిక్షాటన చేస్తే ఎక్కువ డబ్బు వస్తుందని జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.


ఎన్నికల తర్వాత కొంత మంది ఓటర్లను తాను కలిశానని.. అప్పడు వారు ఓటుకు రెండు వేలు ఇచ్చారని..కానీ ఆ రెండు వేలు ఐదేళ్లలో మీకు ఎంత వరకు కాపాడుతుందని..గుడి దగ్గర అడుక్కునే వారికి అంతకంటే ఎక్కువే వస్తాయని ఆయన అన్నారు. ఎన్నికల్లో అద్భుతాలు జరుగుతాయని తానేమీ ఆశించలేదని వ్యాఖ్యానించిన పవన్, ఇకపై తన రాజకీయ ఎత్తుగడలు ఏంటో తెలుస్తాయని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: