బెల్లం ఎక్కడ ఉంటుందో చీమలు అక్కడే ఉంటాయన్న విషయం తెలిసిందే.  అధికార పార్టీ ఏలుబడి ఎన్నాళ్లుంటుందో..అక్కడికే రాజకీయ నాయకులు చేరుకుంటుంటారు.  గతంలో టీడీపీ అధికాంలో ఉండగా వైసీపీ నుంచి 23 మంది నాయకులు జంప్ అయిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఇప్పుడు ఏపిలో వైసీపీ పాలనలో ఉంది..ఈ నేపథ్యంలో ఆ పార్టీ వైపు టీడీపీ, జనసేన చూపు పడుతుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.  
ఇప్పటికే కొంత మంది టీడీపీ నేతలు పార్టీకి దూరంగా ఉంటున్న వార్తలు కూడా వస్తున్నాయి.  మరోవైపు జనసేన నుంచి కూడా వలసలు మొదలవుతాయని వార్తలు వస్తున్నాయి.  ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు పార్టీని వీడుతూ రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు పంపారు. ఇక తాజాగా నాదెండ్ల మనోహర్ కూడా జనసేనకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా మాజీ స్పీకర్, జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ మనోహర్ గత కొంతకాలంగా పార్టీని వీడుతారంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ ఖండించింది. 
నాదెండ్ల అమెరికా పర్యటనలో ఉండటం వల్ల సమావేశానికి హాజరుకాలేకపోయారని.. కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. ఆయన పార్టీని వీడే ప్రసక్తి లేదని వెల్లడించింది.  జనసేన ఈ ఎన్నికల్లో ఓడినంత మాత్రాన తన బలం పోలేదని.. ప్రజల్లో మరింత విశ్వాసం పొందేందుకు కృషి చేస్తుందని..ఓటమికి కారణాలు కూడా పార్టీ అధినేత సమీక్షిస్తున్నారని ఆయన అన్నారు. 
 కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో నాదెండ్ల గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆ రోజు నుంచి ఆయన మీడియాకు కనిపించకపోవడంతో పాటు గుంటూరు జిల్లాకు సంబంధించి పవన్ కల్యాణ్ సమీక్షా సమావేశానికి సైతం హాజరుకాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: