స‌మాజంలో రోజురోజుకు మృగాళ్ల ఆగ‌డాలు మితిమీరిపోతున్నాయి. విచ‌క్ష‌ణ కోల్పోతూ త‌మ‌ను తాము మ‌రిచిపోయి తాము కూడా మ‌నుషుల‌మే అన్న విష‌యాల‌ను వారు మ‌రిచిపోతున్నారు. తాజాగా అస్సాం రోజు జరిగిన ఓ సంఘటన మృగాళ్ల దారుణ ప్రవర్తనను బయట పెట్టింది. అక్కడ క‌ల్చ‌ర‌ల్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న కొందరు మహిళల‌ను దుస్తులు విప్పేసి డ్యాన్స్ చేయాలంటూ అక్క‌డ ఉన్న పురుషుల గ్యాంగ్‌ తీవ్రమైన ఒత్తిడి చేసింది. అసోంలోని కామ్‌రూప్ జిల్లాలో జరిగిందీ ఘటన. 


ఈ ఘటనతో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘ‌ట‌న పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. ప‌శ్చిమ బెంగాల్‌లోని కుచ్‌బెహ‌ర్ నుంచి వ‌స్తోన్న డ్యాన్స్ బృందం స్ట్రిప్ డ్యాన్స్ (దుస్తులు ఒక్కొక్కటిగా తీసివేస్తూ చేసే నృత్యం) చేస్తుందని ప్రచారం చేసిన నిర్వాహకులు టికెట్లను అమ్మేశారు. దుస్తులు విప్పేసి మ‌హిళ‌లు డ్యాన్స్ చేస్తార‌న్న ప్ర‌చారంతో యువ‌కులు ఎగ‌బ‌డి మ‌రీ టిక్కెట్ల‌ను కొన్నారు. 


వాస్త‌వంగా ఇది క‌ల్చ‌ర‌ల్ ప్రోగ్రామ్‌. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాక మ‌హిళ‌ల‌ను దుస్తులు విప్పేసి డ్యాన్స్ చేయాలంటూ నిర్వాహ‌కులు వాళ్ల‌పై తీవ్ర‌మైన ఒత్తిడి చేశార‌ట‌. వారి నుంచి ఏదోరకంగా తప్పించుకుని బయటపడిన ఆ బృందం స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. చివ‌ర‌కు వాళ్లు అక్క‌డ నుంచి త‌ప్పించుకుని వాహ‌నాల్లో పారిపోతుంటే వారిపై రాళ్లతో దాడిచేశారు. ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తోన్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: