అందుకలదిందు లేదని సందేహము వలదు ఎందెందు వెతికినా అందందు కలదు! అన్న విధంగా అక్రమంగా రవాణా చేస్తుంటారు స్మగ్లర్లు.... తాము అనుకున్నది చేయటానికి కొత్తకొత్త ఐడియాలు వేస్తూ.. కొత్తకొత్త దారులు వెతుక్కుంటూ ముందుకు సాగిపోతున్నారు.

అసలు విషయం ఏంటంటే.. స్పెయిన్‌కు చెందిన ఓ స్మగ్లర్ల ముఠా కొకైన్‌ను రవాణా చేయటానికి ఓ కొత్తమార్గం ఎంచుకుంది. మామూలుగా అయితే దొరికిపోతామన్న ఉద్ధేశ్యంతో రాళ్లలో(తయారుచేయబడ్డవి) కొకైన్‌ను ఉంచి స్పెయిన్‌కు తరలించారు. అయితే ఎవరికీ అనుమానం రాకుండా కొకైన్‌ రాళ్లతో పాటు, మామూలు రాళ్లను కూడా కలిపి రవాణా చేశారు.

రాళ్లను ఓ గోడౌన్‌లో ఉంచి కొద్దిరోజుల తర్వాత బయటకు తీసి అమ్ముదామని అనుకున్నారు. కానీ ప్లాన్‌ బెడిసికొట్టింది. ఎలా కనిపెట్టారో తెలీదు కానీ! పోలీసులు కొకైన్‌ రాళ్లు ఉన్న గోడౌన్‌కు చేరుకున్నారు. రాళ్లను సుత్తెల సహాయంతో పగులగొట్టి కొకైన్‌ను బయటకు తీశారు. దాదాపు 1,88,000 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు తెగబడ్డ 12మందిని అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: