జగన్ మంత్రి వర్గం ప్రమాణస్వీకారం చేసిన టార్5మొదటి క్యాబినెట్ మీటింగ్ ఈరోజు ఉదయం వెలగపూడి లోని సచివాలయంలో ప్రారంభం అయ్యింది. ఈ సమావేశంలో 8 అంశాలపై చర్చించబోతున్నట్టు సమాచారం. 
చర్చించబోయే ఈ 8 అంశాలను తప్పకుండా అమలు చేయాలని జగన్ ముందుగానే మంత్రులకు సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా అవినీతి కనబడకూడదని ఇప్పటికే హుకుం జారే చేసిన సంగతి విదితమే. చర్చించబోతున్న 8 అంశాలకు సంబంధించిన శాఖలకు సంబంధించిన సమాచారాన్ని జగన్ ఇప్పటికే తెప్పించారు. 
వాటిపై రివ్యూ చేశారు. ప్రమాణస్వీకారం రోజున జగన్ పింఛన్ ను 2000 నుంచి 3000 వరకు పెంచుకుంటూ పోతామని హామీ ఇచ్చారు. ఇవ్వడమే కాదు ఆ దిశగా సంతకం కూడా చేయారు. పింఛన్ పెంపుకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. దీంతో పాటు ఆశా వర్కర్ల జీతాలను3 వేల నుంచి 10 వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి సంబందించిన దానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేయనుంది. 
వైఎస్సార్ రైతు భరోసా పధకం కింద రైతులపై ఇవ్వాల్సిన 12500 రూపాయల పధకానికి కూడా ఆమోదముద్ర వేయబోతున్నారు.
అలాగే ఉస్యోగుల ఐఆర్ ప్రకటించేందుకు వీలుగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నది.  ఆర్టీసీ విలీనంపై కూడా ఈరోజు జరుతున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇలా వీటితో పాటు అనేక అంశాలపై సుదీర్ఘ చర్చ చేసి నిర్ణయాలు టీలుకోబోతున్నట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: