'ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు అవుతాయ్' అనే సామెత మాదిరిగా తయారైంది  ప్రస్తుతం 'టీవీ9' మాజీ సీఈఓ రవి ప్రకాష్ పరిస్థితి.  ఒకప్పుడు 'ముఖ్యమంత్రి, డీజీపీ' వంటి ప్రముఖల పక్కనే కూర్చుని చనువుగా మాట్లాడిన రవి ప్రకాష్ ని.. ఇప్పుడు ఒక సాధారణ కానిస్టేబుల్ కూడా పక్కకు ఈడ్చుకుంటూ తీసుకువెళ్తున్నాడు. కింద వీడియోలోని  ఈ సంఘటనను చూస్తే..  'కాల గమనంలో  ఎవరు ఎప్పుడు హీరోలవుతారో.. ఎవరు ఎప్పుడు జీరోలవుతారో ఎవరికీ తెలియదని'  ఓ సినీ కవి చెప్పిన డైలాగ్ గుర్తుకువస్తోంది.  మొత్తానికి మీడియానే ప్రభావితం చేసిన రవిప్రకాష్ చుట్టూ  ఉచ్చు గట్టిగానే బిగిసినట్లు అర్ధమవుతుంది.    


గ‌త మంగ‌ళ‌వారం పోలీసుల ముందు హాజ‌రైన ర‌విప్ర‌కాష్..  విచార‌ణ‌లో పొంత‌న లేని స‌మాధాన‌లు చెబుతూ పోలీసులను తప్పిద్రోవ పట్టించే ప్రయత్నాలు చేసాడని  ఇప్పటికే  సైబ‌రాబాద్ క్రైమ్ ఏసీపీ శ్రీ‌నివాస్  మీడియాకు స్పష్టం చేశారు. ఈ క్రమంలో 'ర‌విప్ర‌కాష్  ఈ కేసు నుండి త‌ప్పించుకునే ఆధారాలు ఆయన దగ్గర లేవని ఏసీపీ శ్రీ‌నివాస్ వ్యాఖ్యానించడం.. అలాగే  ఓ సాధారణ కానిస్టేబుల్  కింద వీడియోలో  రవిప్రకాష్ తో  ప్రవర్తించిన విధానం చూస్తే.. రవిప్రకాష్ గడ్డు కాలం ఎదురుకోబోవడం ఖాయంగా కనిపిస్తోంది.  అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో రవిప్రకాష్  ఈ కేసు నుండి బయట పడాలంటే..

తెలంగాణ ప్రభుత్వం సహకారం తప్పనిసరి. రవిప్రకాష్ సన్నిహితులు ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది.  కానీ రవిప్రకాష్ గతంలో..   ప్రస్తుతం ఓటమిపాలైన ఓ రాజకీయపార్టీని మాత్రమే హైలైట్ చేస్తూ.. ఆ పార్టీ నాయకుడి కన్నా వీరుడు సూరుడు లేడని కీర్తిస్తూ...  చిత్రీకరించిన కథనాలకు 'కర్త క్రమ క్రియ' రవిప్రకాషే అని  బలంగా నమ్ముతున్న  ప్రస్తుత అధికారిక పార్టీలు  రవిప్రకాష్ ను  ఈ కేసు నుండి బయట పడేస్తాయా అంటే చెప్పలేని పరిస్థితే. 


మరింత సమాచారం తెలుసుకోండి: