పెన్షను పెంపుపై తొలిసంతకం నుంచి, ఆశావర్కర్ల వేతనాల పెంపు వరకు,సీఎం అయిన తొలినాటినుంచి జగన్మోహన్‌ రెడ్డి తన ముద్ర చూపిస్తున్నారు. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయదలచుకున్న నిర్ణయంపై కూడా ఇవాళ కేబినెట్‌ భేటీలో ప్రధాన చర్చ జరుగుతుంది. లక్షలాదిగా ఉండే ఆర్టీసీ కార్మికులందరికీ రుచించే విధంగానే ఈ విషయంలోనూ నిర్ణయం ఉంటుందని అనుకోవచ్చు. ప్రభుత్వ ప్రతిపాదనపై కార్మిక సంఘాలు ఏమంటున్నాయి..? 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశం మరోమారు తెరమీదకొచ్చింది. తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని ఎజెండాలో చేర్చటాన్ని కార్మిక సంఘాలు స్వాగతిస్తున్నాయి.

ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న పరిపాలన, నిర్వహణ వ్యవస్థను అదే తరహాలో కొనసాగించి ఆర్థికపరమైన అంశాల్లో సంస్థకు మేలు జరిగేలా, సంస్థ విస్తరణకు దోహదపడేలా, కార్మికులందరికీ ప్రభుత్వ ఉద్యోగుల తరహా సదుపాయాలు, రాయితీలు వర్తింపజేసేలా జగన్‌ సర్కార్‌ అడుగులు వేసే అవకాశం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: