ఏపీ కేబినేట్ భేటీ ఈ రోజు ఉదయం 10.30 గంటలకు సచివాలయం తొలి బ్లాకులోని మొదటి అంతస్తులో గల మంత్రివర్గ సమావేశం మందిరంలో జరుగుతోంది. ఈ భేటీలో జగన్ సర్కార్ పలు కీలక విషయాలపై నిర్ణయాలు తీసుకుంది. ప్రమాణ స్వీకారం నాడు సీఎం జగన్ చేసిన ప్రకటన మేరకు వృద్ధాప్య పింఛన్లు రూ.2250కి పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే  ఆశా వర్కర్ల జీతాలు రూ.3000 నుంచి 10,000కు పెంచుతూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మేరకు మంత్రిమండలి ఆమోదం పలికింది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ చెల్లింపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు  కేబినెట్ బేషరతుగా అంగీకారం తెలిపింది. వీలైనంత త్వరగా ఆర్టీసీ విలీన ప్రక్రియ చేపట్టాలని  కేబినెట్ నిర్ణయించింది. ఇంకా కేబినెట్ భేటీ కొనసాగుతుంది. రైతులకు ఏటా అందించనున్న రూ. 12,500/-  పెట్టుబడి సాయంపై కేబినెట్ చర్చించనుంది. సాయంత్రం వరకు సాగనున్న ఈ భేటీలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: