బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డబ్బును ఎలా దుబారాగా ఖర్చు చేశారో మనందరమూ చూశాము . పది రూపాయలతో అయేపని వెయ్యి రూపాయలతో చేయడం బాబుగారి స్టైల్. ఒక పక్క రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేందటూనే మరో పక్క కోట్లు కోట్లు వృధాగా ఖర్చు చేసి ఖజానాను ఖాళీ చేశారు. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం కేవలం 10 రూపాయల బాటిల్ మాత్రమే వాడటం గమనార్హం. అది సీఎం అయినా సరే, సీఎస్ అయినా సరే, చివరికి మంత్రులైనా సరే. 


కానీ బాబు గారి హయాంలో అయన మరియు అతను పుత్ర రత్నం లోకేష్ మాత్రమే హిలమాలయ బాటిల్స్ వాడేవారు. కానీ జగన్ మాత్రం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. చంద్రబాబు జమానాలో ఆర్భాటాల కోసం.. సోకు కోసం పెట్టిన ఖర్చు అంతా ఇంతా కాదు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుందే ఇలాంటివాటికి తన దగ్గర నడవవని తేల్చేసిన జగన్.. సింఫుల్ గా ఉంటున్నారు.


తాజాగా తిరుపతికి వచ్చిన ప్రధాని మోడీకి తానేమిటన్న విషయాన్ని.. ఖర్చు విషయంలో తన తీరు ఎలా ఉంటుందన్న విషయాన్ని తన చర్యతో చెప్పకనే చెప్పేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.సాధారణంగా ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం పలికే క్రమంలో భారీ బొకేల.. పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వటం ఒక అలవాటుగా ఉండేది. అందుకు భిన్నంగా తాజాగా బొకేలను బంద్ చేసి సింగిల్ గులాబీని ముచ్చటగా చేతికి ఇచ్చిన వైనం కొత్తగా ఉండటమే కాదు.. అనవసర ఖర్చుకు ఎలా కళ్లెం వేస్తానన్న విషయాన్ని మోడీకి జగన్ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: