ఏపీ నూతన కేబినెట్ కొలువు దీరిన వేళ..కొత్త మంత్రులకు అమరావతి ప్రాంతంలోని సచివాలయ ప్రాంగణంలో ఛాంబర్లు కేటాయించారు. దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సోమవారం ఉదయం విడుదల చేశారు. అయితే కొంతమంది మంత్రులు వాస్తు, సంఖ్యాశాస్త్రం ప్రకారం తమకు ఛాంబర్ల నంబర్లను కేటాయించాలని కోరగా ప్రభుత్వం సమ్మతించింది.
వెలగపూడి సచివాలయంలో ఉన్న ఐదు భవన సముదాయాల్లో మంత్రుల పేర్లకు అనుగుణంగా వాస్తు ప్రకారం ఛాంబర్ల గదులను కేటాయిస్తూ సీఎస్ సుబ్రహ్మణ్యం ఈ రోజు ఉదయం జీవో విడుదల చేశారు. వీటిలో సీనియర్లకు, జూనియర్లకు వేరు వేరుగా ఛాంబర్లు కేటాయించారు.
మంత్రులకు కేటాయించిన ఛాంబర్ల వివరాలు :
పిల్లి సుభాష్ చంద్రబోస్-ఉప ముఖ్యమంత్రి- రూమ్ నంబర్ 215, తొలి అంతస్తు (బిల్డింగ్-2)
కె నారాయణ స్వామి-ఉప ముఖ్యమంత్రి- రూమ్ నంబర్ 127, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్-4)
ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్-ఉప ముఖ్యమంత్రి-రూమ్ నంబర్ 191, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్-5)
పుష్పా శ్రీవాణి-ఉప ముఖ్యమంత్రి-రూమ్ నంబర్ 203, తొలి అంతస్తు (బిల్డింగ్-3)
అమ్జాద్ బాషా-ఉప ముఖ్యమంత్రి-రూమ్ నంబర్ 212, తొలి అంతస్తు (బిల్డింగ్-3)
ధర్మాన కృష్ణదాస్- రోడ్లు, భవనాల శాఖ మంత్రి- రూమ్ నంబర్ 193, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్-5)
బొత్స సత్యనారాయణ- మున్సిపల్ శాఖ మంత్రి- రూమ్ నంబర్ 135, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్-2)
ముత్తంశెట్టి శ్రీనివాస రావు (అవంతి శ్రీనివాస్)- పర్యాటక శాఖ మంత్రి- రూమ్ నంబర్ 210, తొలి అంతస్తు (బిల్డింగ్-3)
కురసాల కన్నబాబు- వ్యవసాయ శాఖ మంత్రి- రూమ్ నంబర్ 208, తొలి అంతస్తు (బిల్డింగ్-2)
పినిపె విశ్వరూప్- సాంఘిక సంక్షేమశాఖ- రూమ్ నంబర్ 211, తొలి అంతస్తు (బిల్డింగ్-3)
రంగనాథ రాజు - గృహ నిర్మాణం- రూమ్ నంబర్ 211, తొలి అంతస్తు (బిల్డింగ్-4)
తానేటి వనిత- మహిళా, శిశు సంక్షేమం- రూమ్ నంబర్ 210, తొలి అంతస్తు (బిల్డింగ్-5)
కొడాలి శ్రీవెంకటేశ్వర రావు (కొడాలి నాని)- పౌర సరఫరాలు- రూమ్ నంబర్ 130, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్-4)
పేర్ని వెంకట్రామయ్య (పేర్నినాని)- రవాణా, సమాచార శాఖ- రూయ్ నంబర్ 211, తొలి అంతస్తు (బిల్డింగ్-5)
వెల్లంపల్లి శ్రీనివాస్- దేవాదాయం-రూమ్ నంబర్ 137, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్-2)
మేకతోటి సుచరిత- హోమ్ శాఖ- రూమ్ నంబర్ 136, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్-2)
మోపిదేవి వెంకట రమణ-పశు సంవర్ధక శాఖ- రూమ్ నంబర్ 132, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్-4)
బాలినేని శ్రీనివాస రెడ్డి- విద్యుత్ అటవీ, పర్యావరణ శాఖ- రూమ్ నంబర్ 211, తొలి అంతస్తు (బిల్డింగ్-2)
ఆదిమూలపు సురేష్- విద్యా శాఖ- రూమ్ నంబర్ 210, తొలి అంతస్తు (బిల్డింగ్-4)
పీ అనిల్ కుమార్ యాదవ్- నీటి పారుదల శాఖ- రూమ్ నంబర్ 212, తొలి అంతస్తు (బిల్డింగ్-4)
మేకపాటి గౌతమ్ రెడ్డి- పరిశ్రమలు, ఐటీ శాఖ- రూమ్ నంబర్ 208, తొలి అంతస్తు (బిల్డింగ్-4)
పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి- పంచాయతీ రాజ్, గనులు, భూగర్భ వనరులు- రూమ్ నంబర్ 188, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్-5)
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి- ఆర్థిక శాఖ- రూమ్ నంబర్ 212, తొలి అంతస్తు (బిల్డింగ్-2)
గుమ్మనూరు జయరాం- కార్మిక, ఉపాధి కల్పన శాఖ- రూమ్ నంబర్ 207, తొలి అంతస్తు (బిల్డింగ్-3)
శంకర్ నారాయణ- బీసీ సంక్షేమం- రూమ్ నంబర్ 131, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్-4)