విభజన అనంతరం కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన నరసింహన్ నే బీజేపీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు త్వరలో ఇద్దరు కొత్త గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నియమించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై చర్చించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ భేటీ అయ్యారు. సుమారు రెండు గంటలపాటు సుధీర్ఘంగా భేటీ జరిగింది. 


అప్పటి యూపీఏ ప్రభుత్వం నియమించిన గోవేర్నర్లలో ఇప్పటికీ కొనసాగుతుంది నరసింహన్ ఒక్కరే. మోడీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జాతీయ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తో ఉన్న పరిచయం వల్లే ఇది సాధ్య పడింది. అయితే ఇప్పుడు రాజకీయ అవసరాల కారణంగా ఆయనను సాగనంపాలని నిర్ణయించుకున్నారు. అమిత్ షా - నరసింహన్ భేటీలో తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లను నియమించే అంశంపై నిశితంగా చర్చించారు. 


అనంతరం తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన గవర్నర్.. మర్యాదపూర్వకంగానే హోం మంత్రితో భేటీ అయ్యానన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితిని వివరించినట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు స్నేహపూర్వకంగానే ముందుకు సాగుతున్నాయని గవర్నర్ మీడియాకు వివరించారు. తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తొలుత భవనాల సమస్యలను పరిష్కారించామని.. త్వరలోనే మిగిలిన సమస్యలు పరిష్కారం అవుతాయని గవర్నర్ నరసింహన్ చెప్పుకొచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: