Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 10:07 pm IST

Menu &Sections

Search

కులవివాదం లో కురుపాం ఎమ్మెల్యే

కులవివాదం లో కురుపాం ఎమ్మెల్యే
కులవివాదం లో కురుపాం ఎమ్మెల్యే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి , విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి గిరిజన సామాజిక వర్గం కాదా? అంటే గిరిజన సంఘాల నేతలు అవుననే అంటున్నారు. గిరిజనేతర మహిళను తీసుకువచ్చి మంత్రి పదవి కట్టబెట్టడమే కాకుండా, ఆమెను ఉప ముఖ్యమంత్రిని చేయడం హాస్యాస్పదంగా ఉందని మండిపడుతున్నారు. పుష్ప శ్రీవాణి కులానికి సంబంధించిన కేసు ప్రస్తుతం న్యాయస్థానం లో కొనసాగుతుందని  గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పల నర్స తెలిపారు. అరకు లో ఆయన మీడియా తో మాట్లాడుతూ పుష్ప శ్రీవాణి సోదరి రామ తులసి ఎస్టీ కాదని గతంలో  పార్వతీపురం ఐటి డిఏ అధికారులు జరిపిన విచారణ లో తేలిందని గుర్తు చేశారు. ఎస్టీ కాదని అధికారులు ధ్రువీకరించడం తో రామతులసి తన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు.


సోదరి రామతులసి ఎస్టీ కానప్పుడు పుష్ప శ్రీవాణి ఎలా ఎస్టీ అవుతుందని, ఎస్టీగా పరిగణిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , ఆమెను మంత్రివర్గం లోకి తీసుకుంటారని అప్పల నర్సు ప్రశ్నిస్తున్నారు.  గిరిజనేతరులు, గిరిజనులుగా చలామణి అవుతుండడం వల్లే అసలైన గిరిజనులకు అన్యాయం జరుగుతోందని గిరిజన సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . పుష్ప శ్రీవాణి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే ఆమె గిరిజనురాలు కాదంటూ కేసు దాఖలయింది . ఆ కేసు ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీవాణి గిరిజన రిజర్వ్ అసెంబ్లీ స్థానం కురుపాం నుంచి  పోటీ చేయడాన్ని బీజేపీ గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి గాంధీ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ, ఆమె కులం పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు తాజాగా తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని నిబంధన ఉన్నప్పటికీ, దాన్ని కాదని శ్రీవాణి 2013  పొందిన కుల ధ్రువీకరణ పత్రాన్ని నామినేషన్ సమయం లో సమర్పించడం, దాన్ని ఎన్నికల అధికారి ఒకే చేయడాన్ని కూడా గిరిజన సంఘాల నేతలు తప్పుపడుతున్నారు.


గతం లో శ్రీవాణి ఎస్టీ కాదంటూ   రాజకీయ  ప్రత్యర్ధులు చేసిన ఆరోపణలనే, ఇప్పుడు గిరిజన సంఘాల నేతలు చేస్తుండడం తో జగన్ సర్కార్ ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కన్పిస్తున్నాయి. అయితే గతం లోనూ మంత్రి పదవి చేపట్టిన పలువురు ప్రజాప్రతినిధుల్ని గిరిజన సంఘాల నేతలు,  గిరిజనేతరు లుగా పేర్కొనడం, వారు ఈ వివాదాలు కొనసాగుతుండగానే పదవి కాలాన్ని పూర్తి చేయడం జరిగిపోయాయి. ఇప్పుడు శ్రీవాణి కూడా ఎస్టీ కాదంటూ గిరిజన నేతలు ఆరోపణలు చేస్తున్న, ఆమె ను మంత్రివర్గం నుంచి ముఖ్యమంత్రి తప్పించే సూచనలు ఎంతమాత్రం కన్పించడం లేదు.


pushpa-srivani
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మెగా హీరోల చిత్రాల్లో  ఆ కమెడియన్ కు  నోఛాన్స్
అవును ..అడల్ట్ ఫిల్మ్ చూశానన్న టాలీవుడ్ హీరోయిన్
కోమటిరెడ్డి సోదరుల మధ్య బేదాభిప్రాయాలు
బాబును ఆ ఇల్లు ఖాళీ చేయించి తీరుతాం
టీడీపీ ఓటమికి కొత్త కారణం చెప్పిన రోజా
పార్టీ మారడానికి  150 కోట్లు ... మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారట
టీడీపీ ని వీడనున్న గంటా ?
జూనియర్ ను రాజకీయాల్లో ప్రజలు ఆదరించరు
అప్పుడు కాదన్నా వల్లే ... ఇప్పుడు కావాలంటున్నారట
బాబు తప్పులనెంచుతోన్న చౌదరి
నూతన సచివాలయ భవనాల నిర్మాణం అవసరమా ?
గుణ 369 ... మరో ఆర్ ఎక్స్ 100  అవుతుందా?
మాజీ భార్య అన్నందుకు రేణు కు కోపం వచ్చింది
రాజగోపాల్ రెడ్డి తో కలిసి నడిచేది ఎవరెవరు ?
పాక్ పై భారత అజేయ రికార్డు పదిలం
కమలదళం లోకి కోమటిరెడ్డి బ్రదర్స్ ?
చెరో దారిలో కోమటిరెడ్డి సోదరులు ?
పటాస్ రేటింగ్స్ శ్రీముఖి ఎఫెక్ట్
టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు జగన్ సర్కార్ షాక్
జూనియర్ వల్ల టీడీపీకి  ప్రయోజనం శూన్యం
బాలయ్య డైలాగ్ కు రివర్స్ పంచ్ వేసిన విజయసాయి
పెళ్లి పీటలు ఎక్కనున్న రెజీనా ?
యోగ ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం ... మానసిక ప్రశాంతత
జెన్నీ సెకండ్ ఇన్నింగ్స్ త్వరలో స్టార్ట్
 సత్ఫలిస్తోన్న జగన్ సఖ్యతమంత్రం ...రాష్ట్రానికి నిధుల వరదేనా ?
హీరో కంటే ఆ హీరోయిన్ రేమ్యునేషనే అధికం
జగన్మోహనాస్త్రం తో తెలుగు చంద్రులిద్దరు ఉక్కిరి, బిక్కిరి
విమానాశ్రయం లో బాబుకు తప్పని తనిఖీ
ఆమ్మో ... వైకాపా లో చేరడమే
రెండవ పెళ్లి కి రేణు దేశాయ్ రెడీ
ఫిరాయింపు రాజకీయాలు చేసేది లేదు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.