తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన అనంతరం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్ సోమవారం ఢిల్లీ వెళ్ళారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో భారతీయ జనత పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, హోం శాఖ నేతగా బాధ్యతలు స్వీకరించిన అమిత్ షాతో నరసింహాన్ భేటీ అయ్యారు.

మర్యాదపూర్వకంగా హోంశాఖ మంత్రిని కలిసినట్లు భేటీ అనంతరం గవర్నర్‌ తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులను అమిత్‌షాకు వివరించినట్లు చెప్పారు.  తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలను హోంమంత్రికి గవర్నర్‌ నివేదించారన్నారు. 

రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటున్నాయని, స్నేహపూర్వకంగా ఉంటున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలు స్నేహపూర్వకంగా ముందుకు సాగుతున్నట్లు వివరించినట్లు వెల్లడించారు. పెండింగ్‌లోని విభజన సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయన్నారు. తొలుత హైదరాబాద్‌లోని భవనాల సమస్యను పరిష్కరించినట్లు చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య అన్ని సమస్యలు తీరిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: