2014 లో అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు.  మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయి అనగా బాబు బీజేపీని వదిలి... బయటకు వచ్చి.. బీజేపీ ని విమర్శించడం మొదలుపెట్టారు. అక్కడితో ఆగకుండా.. కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి మోడీపై విషప్రచారం చేశాడు.  


మోడీకి ప్రజలు బుద్ది చెప్పాలని, మోడీని చిత్తుగా ఓడించాలని ప్రచారం చేశారు.  మోడీని ఓడించేందుకు బాబు బలం పట్టుకొని దేశం మొత్తం తిరిగారు. ఆయనది ఒకటే మంత్రం మోడీని ఓడించడం.  అదే లక్ష్యంతో ఎన్టీఆర్ ఆశయాలను పక్కన పెట్టి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని గాలికొదిలేసి దేశంలో చక్కర్లు కొట్టారు. 


చివరకు ఏమైంది.. బాబు చెప్పినట్టుగానే ఓడించారు. అయితే, ఎవరిని ఓడించారు.. బాబును ఓడించారు.  ఆంధ్రప్రదేశ్ లో బాబుగారి పార్టీ దారుణంగా ఓటమిపాలైంది.  అభివృద్ధి నినాదంతో.. జాతీయ వాదంతో ఎన్నికల్లోకి వెళ్లిన బీజేపీకి అఖండ విజయం అందించారు.  


అయితే, ఇప్పుడు బాబు స్టాండ్ ఏంటి.. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు.  చైనా గోడలా ఆంధ్రప్రదేశ్ లో స్ట్రాంగ్ అయిన జగన్ ను ఎదుర్కోవడానికి బాబు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: