పాదయాత్రలో విఎస్ జగన్మోహనరెడ్డి ప్రజలకిచ్చిన వాగ్ధానాల అమలుకు రంగం సిద్ధం చేసే దశల్లో వాటికి రాష్ట్ర కాబినెట్ చర్చిస్తూ కొన్నిటికి ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది. ఇక అమలుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అందరి అంచనాలకు తగ్గట్లే మరోసారి తనదైన శైలిలో వడివడిగా నిర్ణయాలు తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి.  ఈ రోజు ఉదయం ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో పలు కీలకనిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేసిననాటి నుంచి, తర్వాతిదశల్లో ఇచ్చినహామీలు, తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిరాజముద్ర ను వేశారు.
Image result for jagan's first cabinet meeTing
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన నూతనంగా విస్తరించిన ఏపీ మంత్రివర్గం తొలి సమావేశం కొనసాగుతోంది. సోమవారం ఉదయం 10.30 గంటలకు సచివాలయం తొలిబ్లాకు మొదటి అంతస్తులో ఈ సమావేశం జరుగుతోంది. తొలి కేబినెట్‌ లోనే, పాదయాత్రలో ప్రజల కిచ్చిన హామీలను అమలుపరిచే దిశగా సమావేశం లో పలు కీలకనిర్ణయాలు తీసుకోబో తున్నారు. 



ఆశా వర్కర్లకు జీతాల్ని ₹3000/- నుంచి ₹10000/- వరకూ పెంచిన నిర్ణయాన్ని మంత్రివర్గ సమావేశం ఆమోదం వేసింది. సామాజిక పెన్షన్ల ను ₹ 2250/- చొప్పున పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది.


ఉద్యోగులకు 27% ఐఆర్ చెల్లింపునకు ఆమోదం పలికింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపిఎస్) రద్ధుపై కమిటీలు ఏర్పాటు చేశారు.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కేబినెట్ సానుకూలం గా స్పందించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ ను వెంటనే ప్రారంభించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.

Image result for jagan's first cabinet meeTing

పారిశుద్ధ్య కార్మికులు హోంగార్డుల వేతనాలకు సంబంధించి ఏం చేయాలనే అంశంపై మంత్రివర్గంలో చర్చ నడుస్తోంది.  ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందు కు కూడా మంత్రివర్గం సుముఖత వ్యక్తం చేసింది. వీలైనంత త‍్వరలో అందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది. అలాగే వైసిపి  రైతు భరోసా పథకం ₹ 12500/ అమలు అక్టోబర్‌ నుంచి  అమలు నిర్ణయం తీసుకుంది కాబినెట్. 

మరింత సమాచారం తెలుసుకోండి: