ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శనార్ధం వచ్చిన సందర్భంగా టీటీడీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రధాని మెప్పు కోసం పురాతన, అరుదైన నాణేలతో మెమెంటో తయారు చేయించిన  అధికారులు దానిని ఆయనకు బహుకరించేందుకు సిద్ధమయ్యారు. స్వామి వారికి చక్రవర్తులు బహుకరించిన బంగారు నాణేలతో బహుమతి ఇవ్వడానికి అంతా సిద్ధం కాగా ఈ వార్త బయటకు పొక్కింది. 


ప్రభుత్వం దాకా వెళ్లడంతో ముఖ్యమంత్రి స్వయంగా కల్పించుకుని వారిని నిలువరించారట. ప్రభుత్వ జోక్యంతో అధికారులు వెనక్కు తగ్గారు. ఎస్వీ మ్యూజియంలో ఉన్న 7, 15, 16, 18వ శతాబ్ధానికి చెందిన ఈ బంగారు నాణేలను అప్పట్లో చక్రవర్తులు శ్రీవారికి బహుకరించారు. ప్రభుత్వ ఆగ్రహంతో  అధికారులు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. టీటీడీ అధికారుల వ్యవహారంపై శ్రీవారి భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. బాధ్యులపై ప్రభుత్వం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 


కాగా "జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఏపీలో శక్తివంతమైన ప్రభుత్వం ఏర్పాటైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచెయ్యాలి. ఏపీ ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. అభివృద్ధిలో దూసుకుపోవడానికి అన్ని అవకాశాలున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. కొత్తదనం సృష్టించే దిశగా నవ్యాంధ్ర అడుగులు వేయాలి. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పడింది.. ప్రజలందరి ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు  ప్రభుత్వం కృషిచేస్తుంది, అంటూ తిరుపతి బహిరంగసభలో ప్రధాని హామీ ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: