విభజన జరిగి అయిదేళ్ళు పూర్తి కావస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కరే గవర్నర్ ఉన్నారు. పదేళ్ళుగా నరసిమ్హన్ ఉమ్మడి ఏపీకి గవర్నర్ గా ఉన్నారు. ఆయన హైదరాబాద్ రాజ్ భవన్ లో ఉంటారు. ఏపీ పాలన అమరావతికి షిఫ్ట్ అయింది. నాలుగేళ్ళుగా అక్కడే సీఎం, మంత్రులు అధికారుల వ్యవస్థ మొత్తం ఉంది. గత డిసేంబర్లో హై కోర్టు కూడా అమరావతికి బదిలీ అయింది. ఈ నేపధ్యంలో ఎన్నికలు జరిగి  అక్కడ టీయారెస్ రెండవమారు అధికారంలోకి వస్తే ఇక్కడ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.


ఇపుడు కేంద్రంలో రెండవమారు బీజేపీ అధికారం చేపట్టింది. హోం మంత్రిగా అమిత్ షా నియమితులయ్యారు. ఆయన చూపు రెండు తెలుగు రాష్ట్రల మీద ఉంది. ఇప్పటికే రెండు మార్లు కొనసాగింపు జరిగిన నరసిమ్హన్ కి ఈసారి చాన్స్ ఉండకపోవచ్చునని అంటున్నారు. ఇక తెలంగాణాలో విస్తరించాలనుకుంటున్న బీజేపీకి కేసీయార్ తో సన్నిహితంగా ఉండే నరసిమ్హన్ వద్దు అని అక్కడి నాయకులు  అంటున్నారు.


వీటిని ద్రుష్టిలో ఉంచుకున్న కేంద్రం ఏపీకి, తెలంగాణాలకు విడివిడిగా గవర్నర్లను నియమించి నరసిమ్హన్ ని  మొత్తం బాధ్యతల నుంచి రిలీఫ్ చేయాలనుకుంటోందని టాక్ నడుస్తోంది.  అదే జరిగితే తెలంగాణాకు కేంద్రంలో సన్నిహితంగా ఉండే కీలక నేతను గవర్నర్ గా చేస్తారు అంటున్నారు. అలాగే ఏపీ విషయానికి వస్తే కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ గవర్నర్ అవుతారని అంటున్నారు. జగన్ కి ఆమెతో మంచి పరిచయాలు  ఉన్నాయి. కర్నాటక గాలి బ్రదర్స్ వల్ల అమె జగన్ కి పరిచయస్తురాలుగా ఉన్నారు. ఆ విధంగా ఆమె నియామకం ఖాయమని తెలుస్తోంది. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: