ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు.  నేడు ఆయన మొదటి సారిగా తన మంత్రి వర్గంతో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సమావేశం ఐదు గంటల పాటు సాగింది.  కాగా, ఈ సమావేశంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ప్రజలకు ఇచ్చిన ఒక్కో హామీలు సీఎం జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చుతూ వస్తున్నారు.


గత కొంత కాలంగా తర్జన భర్జన చేస్తున్న అనంతపురం-అమరావతి ఎక్ప్రెస్ హైవేకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ వచ్చింది..ఈ ప్రాజెక్టును 27,300కోట్లతో(అంచనాతో) అనంతపురం-కడప-కర్నూల్-ప్రకాశం-గుంటూరు జిల్లా పరిధిలో 600km దూరం 6/4 లైన్స్ తో కేంద్రమే చేపడుతోంది. అనంతపురం నుంచి అమరావతి వరకు  ఎక్కడా మలుపులేని 600 కిలోమీటర్ల ఆరు లైన్ల ఎక్స్ ప్రెస్ రహదారి నిర్మాణానికి 26,890 (10,843 హెక్టార్లు) ఎకరాల భూమిని సేకరించాలని  నిర్ణయించింది.

ఇందులో 1518.75 హెక్టార్ల అటవీ భూమి ఉంది.  పరిస్థితులను బట్టి సేకరణ లేక సమీకరణ ద్వారా ఈ భూమిని సమకూరుస్తారు.  ఇంత దూరం రోడ్డు మలుపులేకుండా కొనసాగించడానికి అవసరమైన చోట సొరంగమార్గాలు, వంతెనలు నిర్మిస్తారు. దేశంలో ఎక్కడా ఇటువంటి రహదారిలేదు. ఇదే మొదటిది 
దీనికి ఒకే చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం..ఈ హైవే ప్రత్యేకత 120km వేగం కలిగిన రహదారి గా నిర్మించనున్నారు. సరైనోడు ఆంధ్రప్రదేశ్ ని పరిపాలిస్తే కేంద్రం లో సహాయం ఇలానే ఉంటుందని అంటున్నారు ఆంధ్రప్రజ. 

మరింత సమాచారం తెలుసుకోండి: