ఏపీ తొలి కేబినెట్ భేటీ ముగిసింది. వైయస్ జగన్ నాయకత్వంలోని మంత్రి మండలి తొలి సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంది. వివిధ ఉద్యోగుల వేతనాల పెంపుతో పాటు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, రైతు భరోసా, గ్రామవాలంటీర్ల నియామకం, పేదలకు ఇండ్ల నిర్మాణం , అమ్మ ఒడి పథకాలపై కేబినెట్ విస్తృతంగా చర్చించి పలు అంశాలపై ఆమోద ముద్ర వేసింది. మరోవైపు సీఎం జగన్ మంత్రులు అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని, తక్షణమే విచారణ జరిపించి బర్తరఫ్ చేస్తామని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. తొలి కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పేర్ని నాని తదితరులు మీడియాకు వివరించారు.


తొలి కేబినెట్‌ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే...!


-   ప్రధానంగా ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
  ఆర్టీసీ విలీనంపై ఒక కమిటీ ఏర్పాటు చేసి మూడు నివేదికల్లో నివేదన ఇవ్వాలని కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది.
-  జూలై నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ పెంపుకు కేబినెట్ ఆమోదం 
- ఆశావర్కర్ల జీతం రూ. 10 వేల పెంపునకు కూడా ఆమోదం  
-  కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల జీతం రూ.4 వేలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం 
-  అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు
- గ్రామవాలంటీర్లకు గ్రామాల్లో ఇంటర్ విద్యార్హత..పట్టణాల్లో డిగ్రీ అర్హతగా కేబినెట్ ప్రకటన
- రైతు భరోసా పథకం అక్టోబర్ 15 నుంచి ప్రారంభించాలని  నిర్ణయం
- . రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల మందికి ప్రతి ఏటా రూ. 12,500 /- ఆర్థిక సాయం 
-  రైతు భరోసా పథకాన్ని గ్రామవాలంటీర్ల ద్వారా రైతుల ఇంటికే సాయం
-  రైతులకు తక్షణం ఇన్‌ఫుట్ సబ్సిడీ 
-  రైతులందరికీ వడ్డీలేని రుణాలు
- రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
-  రూ. 2 వేల కోట్లతో ప్రకృతి వైపరిత్యాల సహాయ నిధి ఏర్పాటుకు నిర్ణయం
- ఏపీ రాష్ట్ర రైతు కమీషన్ ఏర్పాటుకు నిర్ణయం
-  రైతుల బ్యాంకు అప్పులపై వడ్డీలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ మేరకు గ్రామవాలంటీర్ల ద్వారా రైతులకు రశీదులు అందిస్తుంది. 
- నవరత్నాల్లోని ప్రతి పేదవాడికి ఇల్లు పథకంలో భాగంగా ప్రతి ఏటా ఆరు లక్షల ఇళ్లు నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్,
    నాలుగేళ్లలో 25 లక్షల ఇండ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం
- వీఏవోలకు రూ. 3 వేల నుంచి రూ. 10 వేలకు జీతాల పెంపునకు కేబినెట్ 
- రీసోర్స్ పర్సన్‌లకు, యానిమేటర్లకు వేతనం రూ. 10,000/- లకు పెంపు
-   ఆర్పీఏలకు కూడా వేతనం రూ. 3000/- నుంచి రూ.10,000/- లకు పెంపు  
- పారిశుద్ధ్య కార్మికులకు వేతనం రూ. 18 వేలకు పెంపు
-  టీడీపీ హయాంలో ఉన్న ఔట్‌ సోర్సింగ్ ఏజెన్సీలన్నీ రద్దు
-  పాదదర్శకంగా కొత్త ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలన్నీ రద్దు
-  ప్రస్తుతం ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కొనసాగింపు
-  కేంద్రీకృత వంటశాలల నుంచి మధ్యాహ్న భోజనం సరఫరా
-  వంట పని చేస్తున్న ఏజెన్సీలదే భోజనం వడ్డించే బాధ్యత
- 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉచిత బోర్లు, రిగ్గులు వేయడానికి కేబినెట్ ఆమోదం
-  సీపీఎస్ రద్దుకు కేబినెట్ సూత్రప్రాయంగా అంగీకారం..సీపీఎస్ రద్దుపై కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయం
-  జూన్ 26 నుంచి అమ్మఒడి పథకం అమలు చేయాలని, చదువుకునే పిల్లలు ఉన్న ప్రతి తల్లికి 
   ఏటా రూ. 15000/- అమ్మఒడి పథకం కింద అందించాలని కేబినెట్ నిర్ణయం 
  రాష్ట్రంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవుల రద్దుకు త్వరలో ఆర్డినెన్స్ జారీ  
- గత ప్రభుత్వం అవినీతిని బయటపెడతామని కేబినెట్ ప్రకటించింది. 
-  ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలో, కాంట్రాక్టుల విషయంలో జ్యుడిషియల్ కమీషన్ ప్రకారం చేపట్టాలని నిర్ణయం
- .రాష్ట్రంలో చేపట్టే ప్రతి కాంట్రాక్టు పాదర్శకంగా ఉంటుందని జగన్ స్పష్టం చేశారు.


 ఈ కేబినెట్ దేశానికి ఆదర్శంగా నిలవాలని మంత్రులకు సీఎం జగన్ హితవు పలికారు. మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తే ఉపేక్షించేది లేదు.. అవినీతి జోలికి వెళ్లద్దు అని సీఎం జగన్ మంత్రులకు హెచ్చరికలు జారీ చేశారు.  మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చినా తక్షణమే విచారణ జరిపి మరు నిమిషంలో మంత్రివర్గం నుంచి తొలగిస్తామని సీఎం జగన్ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు.

ఈరోజు గా సీఎం జగన్ నాయకత్వంలో జరిగిన తొలి కేబినెట్ పలు ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఆర్టీసీ విలీనం, చిరు ఉద్యోగుల వేతనాల పెంపు, సీపీయస్ రద్దు, రైతు భరోసా, అమ్మఒడి పథకం, గ్రామవాలంటీర్ల వ్యవస్థ,  అవినీతిరహితంగా పారదర్శక పాలన అందించడం వంటి నిర్ణయాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా వైయస్ జగన్ కేబినెట్ తొలి సమావేశంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుని సంచలనం సృష్టించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: