అది గ‌త సీఎం చంద్ర‌బాబు ఎంతో ముచ్చ‌ట‌ప‌డి నిర్మించుకున్న స‌చివాల‌యం. అందులోనూ కేబినెట్ హాల్‌. దీనికి మ‌రింత ప్ర‌త్యేకత ఉంది. సీఎంగా చంద్ర‌బాబు కూర్చుకునే సీటుకు వెనుక భాగంలో పువ్వులు పువ్వుల‌తో కూడిన ప్ర‌త్యేక డిజైన్ గోడ‌కు అమ‌ర్చి ఉంటుంది. దీని వెనుక చాలా స్టోరీ ఉంది. చంద్ర‌బాబు ఈ రాష్ట్రంలో క‌నీసం 20 ఏళ్ల‌పాటు అధికారంలో ఉండాల‌ని అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న సెంటిమెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా సింగ‌పూర్ న‌మూనాను ఎక్కువ‌గా న‌మ్మిన చంద్ర‌బాబు ఆ దేశ ప్ర‌జ‌లు అనుస‌రించే బౌద్ధాన్ని ఇక్క‌డ కూడా అర‌కొర‌గానైనా ఇంప్లిమెంట్ చేశారు. 


దీనిలో భాగంగానే రాజ‌ధానికి అమ‌రావ‌తి అనే పేరునుంచి ప్ర‌తికార్య‌క్ర‌మాన్నీ బౌద్ధానికి ద‌గ్గ‌ర‌గా తీసుకు వెళ్లారు. తాను కేబినెట్ హాల్లో కూర్చొనే సీటు వెనుక భాగంలో ఏర్పాటు చేసుకున్నడిజైన్ కూడా దీనిలో భాగంగానే ఏర్పాటు చేసుకు న్నారు. ఈ డిజైన్ ద్వారా ఎంతో శ‌క్తి వ‌స్తుంద‌ని, దీనికి ముందు భాగంలో కూర్చుని తీసుకునే నిర్ణ‌యాల‌కు చాలా శ‌క్తి ఉంటుంద‌ని, ఆ నేత‌కు ఇక తిరుగు ఉండ‌ద‌ని అప్ప‌ట్లో చంద్ర‌బాబు ఆయ‌న మీడియా కూడా ప్ర‌చారం చేసింది. అంతే కాదు, ఈ డిజైన్‌లో ఉన్న ప్ర‌తి రేకుకు అనేక ఉప‌మానాలు కూడా ఉన్నాయంటూ ప్ర‌చారంలోకి తెచ్చారు. స‌రిగ్గా ఇప్పుడు అదే ప్లేస్‌లో జ‌గ‌న్ కూర్చున్నారు. 


కానీ, సీటు బాబుదే అయినా.. అందులో జ‌గ‌నే కూర్చున్నా.. నిర్ణ‌యాల్లో మాత్రం సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నారు. ప్ర‌తి విష‌యంలోనూ చాలా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. తొలికేబినెట్ మీటింగ్‌ను ఏర్పాటు చేసిన ఆయ‌న సోమ‌వారం సీఎం చంద్ర‌బాబు కూర్చున్న కుర్చీలోనే కూర్చున్నారు. అయితే, చంద్ర‌బాబుకు భిన్న‌మైన నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఉద్యోగులు, ప్ర‌జ‌లు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విష‌యాల‌పై సంచ‌ల‌న నిర్ణ‌యాలకు కూడా జ‌గ‌న్ ఓకే చెప్పారు. ఈ ప‌రిణామంతో జ‌గ‌న్ పేరు ప్ర‌భంజ‌నంగా వినిపిస్తోంది. ఎక్క‌డ విన్నా.. కులాలు, మ‌తాల‌కు అతీతంగా జ‌గ‌న్ మావాడు.. మంచి సీఎం అనే పేరు వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు చంద్ర‌బాబుకు సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ కాక‌పోయినా.. జ‌గ‌న్‌కు వ‌ర్క‌వుట్ అవుతోంద‌ని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: