ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా సుస్మా స్వరాజ్ !
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన అనంతరం నూతన ఆంధ్ర ప్రదేశ్ కు తొలి గవర్నరుగా  భారతీయ జనతా పార్టీ లో  కీలక పదవులు నిర్వహించిన సుస్మా స్వరాజ్ ను నియమించినట్టు ట్విట్టర్ పోస్టింగ్స్ వైరల్ అవుతున్నాయి. మాజీ విదేశాంగ మంత్రిగా చేసిన సుస్మా స్వరాజ్ తన ట్విట్టర్ లో పోస్టింగ్ పెట్టినట్టుగా సోషల్ మీడియాలో అనేక మంది పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో పట్టు సాధించేందుకు బి జె పీ పావులు వేగవంతం చేసినట్టు సుస్మా నియామకాన్ని బట్టి తెలుస్తోంది. 


గత ఎన్నికల్లో కనీసం ఒకటి రెండు సీట్లు దక్కించుకునే బి జె పీ ఇటీవల జరిగిన 2019 ఎన్నికల్లో కనీసం అది కూడా పొందాక పోయేసరికి ఆంధ్రా లో వచ్చే ఎన్నికల నాటికి పాగా వెయ్యాలని చూస్తోంది. ఆ దిశగా పావులు కదుపుతూ  తిరుమల తిరుపతి దేవస్థానం మూలాధారంగా దేవుడనే సెంటిమెంట్ తో రాష్ట్రంలో పాగా వేయాలని భావిస్తోన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందులో భాగంగా సుస్మా స్వరాజ్ ను రాష్ట్ర గవర్నర్గా నియమించినట్టు సమాచారం .


మరింత సమాచారం తెలుసుకోండి: