-  స్వరాజ్య మైదాన్ ఎగ్జిబిషన్ లో ఏపీ పోలీస్ ప్రదర్శన అవుట్ పోస్ట్ ను ప్రారంభించిన డీజిపీ గౌతమ్ సవాంగ్
పోలీస్ శాఖా పనితీరు, సెక్యూరిటీ ఏర్పాట్లు అందుకు  తీసుకునే మెళకువలపై సామాన్యులకు పోలీస్ శాఖ తెలియజేయదలచింది. ఇటీవల సి ఏం సెక్యూరిటీ వీక్ అన్న సంగతిపై పెద్ద దుమారం రేగడంతో పోలీస్ శాఖ సామాన్యులకు అర్ధమయ్యే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర డి జి పీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన ఏమిచెప్పరంటే ...


 పోలీస్ శాఖ గురించి అవగాహన కోసం, పోలీసులు వాడే టెక్నాలజీ గురించి ప్రజలు తెలుసుకోవడం కోసం ఎగ్జిబిషన్ లో అవుట్ పోస్ట్ పెట్టాం. 
వేలాది మంది ప్రజలు వచ్చే ప్రాంతం కాబట్టి ఎగ్జిబిషన్ లో స్టాల్ పెట్టాం.. పోలీస్ సర్వీస్ ను ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది తెలుసుకోవచ్చు.  పోలీస్ సర్వీస్ లో ప్రజల్ని భాగస్వామ్యం చేయడం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం.

పోలీస్ శాఖలో వీక్లీ ఆఫ్ లపై కమిటి వేగంగా పనిచేస్తుంది. రెండు మూడు రోజుల్లో నివేదిక వస్తుంది. అతి త్వరలో పోలీస్ శాఖలో వీక్లీ ఆఫ్ లపై విధివిధానాలు రూపొందబోతున్నాయి. పొలిటికల్ దాడుల పై వేగంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారిచేశాం. బదిలీలు అనేవి నిరంతప్రక్రియ . యూనిట్ ఆఫీసర్స్ వరుకు బదిలీలు అయ్యాయి.. తొందరపడి బదిలీలు చేయడంలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: