విచిత్రంగా ఏపి రాజకీయాలు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లుగా చంద్రబాబునాయుడు చూపిన బాటలోనే బిజెపి నేతలు అడుగులు వేస్తున్నారు. నిజానికి చంద్రబాబు ఫిరాయింపుల వల్ల భారీగా నష్టపోయింది జగన్మోహన్ రెడ్డి. కానీ అదే ప్రాక్టీసలో పెడుతున్నది మాత్రం బిజెపి. అంటే జగన్ చేయాల్సిన పనిని బిజెపి చేస్తోందన్నమాట.

 

వైసిపిని భూస్ధాపితం చేయాలని, జగన్ ను అసలు అసెంబ్లీలోకి అడుగు పెట్టనీయకుండా చేయాలని చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహించారు.  చంద్రబాబు ప్లాన్ వర్కవుటయ్యుంటే జగన్ కు ప్రతిపక్ష హోదా దక్కేది కాదు. కానీ ఫిరాయింపులు 23 ఎంఎల్ఏల దగ్గరే ఆగిపోయింది కాబట్టి చంద్రబాబు కోరిక నెరవేరలేదు.

 

అయితే అప్పటి చంద్రబాబు కోరికను ఇపుడు బిజెపి పూర్తి చేసేట్లే ఉంది చూడబోతుంటే. టిడిపి నుండి వీలైనంతమంది ఎంఎల్ఏలు, ఎంపిలను లాక్కునేందుకు పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తోంది. టిడిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏల్లో కనీసం 10 మందిని లాక్కోవాలని స్కెచ్ వేస్తోందని సమాచారం. అలాగే ముగ్గురు ఎంపిల్లో కనీస ఒకరిని లాక్కునే ప్లాన్ లో ఉంది.

 

బిజెపి ప్లాన్ గనుక వర్కవుటైతే అసెంబ్లీలో చంద్రబాబు  ప్రతిపక్ష నేత హోదా కోల్పోతారు.  అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కాలంటే కనీసం ఆ పార్టీకి 17 మంది ఎంఎల్ఏలుండాలి. అంటే మొత్తం అసెంబ్లీ సీట్లలో కనీసం 10 శాతం సీట్లుండాలి.

 

బిజెపి ప్లాన్ వర్కవుటై టిడిపికున్న 23 ఎంఎల్ఏల్లో 10 మంది బయటకు వెళిపోతే మిగిలేది 13 మందే. అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోవటం ఖాయం. చూశారా జగన్ ను చెడిపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే చిరవకు ఆ ప్రయత్నాలు చంద్రబాబుకే ఇఫుడు రివర్సవుతున్నాయి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: