విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాసరావు నిన్ననే బాధ్యతలు స్వీకరించారు. కొన్నాళ్ళ పాటు మంత్రిగా కుదురుకుందమనుకుంటున్నారు. మరి ఆదిలొనే అపశకునం ఏంటి. ఆయన మంత్రి పదవి జగన్ చెప్పినట్లుగా కనీసం రెండున్నరేళ్ళ పాటు అయినా ఉండదా.


ఆ చాన్సే లేదంటున్నారు విశాఖ జిల్లా మాజీ మంత్రి, సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి. అవంతి మంత్రి హోదాలో విశాఖ వచ్చిన సందర్భంగా చేసిన కామెంట్స్ పై ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలు అంతా అవినీతిపరులు అన్నట్లుగా అవంతి మాట్లాడడం దారుణమని అన్నారు. తాను సీనియర్ మోస్ట్ నేతనని, తన మీద కావాలంటే విచారణ జరిపించుకోవచ్చంటూ సవాల్ చేశారు. మీ చేతిలో అధికారం ఉంది. నేను ఎక్కడైనా భూములు కొట్టేసినట్లుగా తెలిస్తే చర్యలు తీసుకోడనటూ అవంతిని చాలెంజ్ చేశారు.


అంతటితో ఆగని ఈ మాజీ మంత్రి గారు సుద్ద పూసలా నీతులు వల్లిస్తున్న మంత్రి అవంతి చేసిన అవినీతి అక్రమాలను ఆరు నెలల్లోగా తాను అధారాలతో సహా బయటపెడతానని హెచ్చరించారు. అవినీతి బండారం మొత్తం వెలుగులోకి తెస్తానని కూడా గట్టిగా చెప్పారు. మరి మంత్రులు ఎవరైనా అవినీతికి పాల్పడినట్లుగా రుజువు అయితే వారిని తక్షణం తొలగిస్తామని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన వార్నింగ్ నేపధ్యంలో బండారు కనుక అవంతి అవినీతి చిట్టా బయటకు తీస్తే ఆ మంత్రి గారికి వూస్టింగేనా అన్న చర్చ ఇపుడు విశాఖ జిల్లా రాజకీయాల్లో జరుగుతోంది. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: