Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 2:14 am IST

Menu &Sections

Search

ఈమె వైపే దేశం చూపు... ఇంత‌ పాపుల‌ర్ అయిన మ‌హిళా లాయ‌ర్ అస‌లేం చేశారంటే...

ఈమె వైపే దేశం చూపు... ఇంత‌ పాపుల‌ర్ అయిన మ‌హిళా లాయ‌ర్ అస‌లేం చేశారంటే...
ఈమె వైపే దేశం చూపు... ఇంత‌ పాపుల‌ర్ అయిన మ‌హిళా లాయ‌ర్ అస‌లేం చేశారంటే...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నిర్భయ ఘటనను తలపించేలా...దేశ స‌రిహ‌ద్దులోని క‌శ్మీర్‌లో జ‌రిగిన కథువా ఘటన యావత్ భారతాన్ని కదిలించింది.  కఠువా జిల్లాలోని రసానా గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల‌ బాలిక గత ఏడాది జనవరి 10న గుర్రాలను మేపడానికి వెళ్లి అదృశ్యమైంది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం రోజుల తరువాత జనవరి 17న గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆ బాలిక మృతదేహం లభించింది. ఆ బాలికపై పాశవికంగా సామూహిక లైంగిక దాడి జరిగిందని, ఆపై ఆమెను దారుణంగా హత్య చేశారని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. దీనిపై పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఒళ్లు గగుర్పొడిచే అంశాలు వెలుగులోకి వచ్చాయి. బాధిత బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు ఓ కుగ్రామంలోని ఆలయంలో బందీగా ఉంచారు. ఆ ఆలయానికి సాంజీరాం సంరక్షకునిగా ఉన్నాడు. నాలుగురోజులపాటు ఆ బాలికకు మత్తుపదార్థాలు ఇస్తూ, సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆ బాలికను దారుణంగా హతమార్చారు. తాజాగా వీరికి శిక్ష ప‌డ‌గా...ఈ తీర్పు వెనుక ఉన్న‌ది ఓ మ‌హిళా లాయ‌ర్‌.


ఈ కేసులో తొలుత బాధిత కుటుంబానికి అండగా నిలిచారు దీపికా సింగ్ రజవాత్ అనే న్యాయవాది. చిన్నారిపై జరిగిన ఘాతుకానికి చలించి, బాధితురాలి తండ్రిని కలిసి కోర్టులో కేసు దాఖలు చేశారు దీపిక. ఈ కేసు చేపట్టిన తర్వాత ఆమెకు ఎన్నో బెదిరింపులు, అవమానాలు ఎదురయ్యాయి. తనను కూడా రేప్ చేస్తామని దుండగులు భయపెట్టారు. కేసును వదిలేయాలని జమ్ము కశ్మీర్ బార్ అసోసియేషన్ నుంచి కూడా బెదిరింపులు వచ్చాయి. అయినా ఆమె వెనక్కు తగ్గలేదు. బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. కశ్మీరీ పండిట్ అయిన దీపిక స్వస్థలం కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కరిహామా. ఆమె భర్త మాజీ సైనికాధికారి. ప్రస్తుతం బహ్రెయిన్‌లో ఉంటున్నారు. మాతృదేశానికి సేవలందించాలనే ఉద్దేశంతో దీపిక తన కూతురితో కలిసి జమ్ము కశ్మీర్‌లోనే ఉంటున్నారు. ఆమె న్యాయవాది మాత్రమే కాదు సామాజిక కార్యకర్త కూడా. వాయిస్ ఫర్ రైట్స్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా చిన్నారులకూ, మహిళలకు సేవలందిస్తున్నారు. అసిఫా కేసు కఠువా నుంచి పంజాబ్‌లోని పఠాన్‌కోఠ్‌కు బదిలీచేయడంలో దీపిక ఎంతో కృషి చేశారు.


అయితే తనను చంపేస్తామని బెదిరింపులు వస్తున్న కారణంగా ఆమె కేసు విచారణకు హాజరుకావడం లేదని, ఈ కేసు నుంచి ఆమెను తప్పించాలని బాలిక తల్లిదండ్రులు చేసిన విజ్ఞప్తిని కోర్టు మన్నించింది. ఆమెను కేసు నుంచి తప్పించింది. దీనిపై దీపిక ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాధితుల నుంచి నేను ఒక్క రూపాయి కూడా ఫీజుగా తీసుకోలేదు. బాలికకు న్యాయం జరుగాలన్నదే నా తపన. కింది కోర్టులు, హైకోర్టులో పలు కేసులతో నాపై అధిక పనిభారం ఉన్నది అని ఆమె అప్పట్లో పేర్కొన్నారు. భయంతో ఎవరూ ముందుకు రాని సమయంలో తాను బాధిత కుటుంబానికి అండగా నిలబడిన విషయాన్ని గుర్తు చేశారు. తాజాగా కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆమె స్పందించారు. కోర్టు తీర్పు.. అసిఫాకు నివాళి అని, సత్యమే ఎప్పటికైనా విజయం సాధిస్తుందని ట్వీట్ చేశారు. బెదిరింపులు, అవమానాల మధ్య కథువా కేసును సవాల్‌గా తీసుకున్న తన న్యాయవాది జీవితంపై త్వరలోనే పుస్తకం తీసుకురానున్నట్టు చెప్పారు.


kathuva-rape-case
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ముహుర్తం రెడీ... కేసీఆర్ రికార్డు..రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత‌...
బాబోరి గొప్పలు ... ఆంధ్రా కి అప్పుల తిప్పలు ...
హైద‌రాబాద్‌లో స్వ‌రూపానందేంద్ర‌...ఆ కార్య‌క్ర‌మంలోనే కీల‌క నిర్ణ‌యం తీసుకున్న కేసీఆర్‌
చంద్ర‌బాబు ఈగో హ‌ర్ట‌య్యేలా చేసిన బొత్స‌
మ‌ళ్లీ బుక్క‌యిన లోకేష్‌...ఈసారి విజ‌య‌సాయిరెడ్డి చేతిలో...
కేఏపాల్ బ‌యోపిక్‌..హీరో ఎవ‌రంటే...
ప్ర‌జా వేదిక కూల్చివేత‌లోకి బీజేపీ ఎంట్రీ...హైకోర్టు కీల‌క నిర్ణ‌యం...
తెలుగు ఎన్నారై కుటుంబంలో విషాదం..అక‌స్మాత్తుగా గుండెపోటుతో..
ఉండ‌వ‌ల్లి ప్ర‌జావేదిక ఇక చ‌రిత్రే..కూల్చివేత‌లో ఏం జ‌రిగిందంటే...
క‌చోరీలు అమ్మే వ్య‌క్తిపై జీఎస్టీ దాడులు...షాక్‌కు లోనైన ఐటీ అధికారులు
జ‌ర్న‌లిస్టుకు ముఖ్య ప‌ద‌వి...జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం
అంటే...లోకేష్‌కు సీఎం జ‌గ‌న్ దొరికిపోయిన‌ట్లేనా?
అమెరికాలో ఘోర ప్ర‌మాదం...హైద‌రాబాదీ దుర్మ‌ర‌ణం
జంపింగుల వెనుక బాల‌య్య‌...టీడీపీలో కొత్త క‌ల‌క‌లం
జ‌గ‌న్ తొలి క‌లెక్ట‌ర్ల‌ స‌మావేశం...సంచ‌ల‌న ఎజెండా ఇదే...బాబు బ్యాచ్ అవాక్కే
సుజ‌నా, ర‌మేష్ కోసం అమిత్‌షా ఎంట్రీ...ఇక ఇబ్బందేం లేద‌న్న‌ట్లే
108 వ‌చ్చేవ‌ర‌కు ఎందుకు..నా వాహ‌నం ఉందిగా...మంత్రి అనీల్ కుమార్ ఔదార్యం!
జ‌గ‌న్ తొలి క‌లెక్ట‌ర్ల‌ స‌మావేశం...సంచ‌ల‌న ఎజెండా ఇదే...బాబు బ్యాచ్ అవాక్కే
కాంగ్రెస్ జెండా పీకేస్తుంది..తెలంగాణ‌లో అధికారం ఎవ‌రిదంటే..
రైతుల కోసం సంచ‌ల‌న నిర్ణ‌యం...టీడీపీ నేత‌ల‌కు షాకిచ్చిన జ‌గ‌న్‌
మంత్రి మ‌ల్లారెడ్డి...మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్‌
బిగ్ బాస్ కౌశ‌ల్ సంచ‌ల‌నం...మాన‌వ మృగంపై పోరాటానికి రెడీ
కాంగ్రెస్ సంచ‌ల‌న నిర్ణ‌యం...రాష్ట్ర ర‌థ‌సార‌థిగా ఆయ‌నే
బీజేపీలోకి టీడీపీ ఎంపీలు...ఆవేద‌న‌లో వెంక‌య్య‌
బ్రేకింగ్ఃక‌లెక్ట‌ర్ల స‌మావేశంలో కీల‌క మార్పులు...సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం
జ‌గ‌న్‌...నీ మంత్రుల చిట్టా ఉంది...టీడీపీ నేత‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
కేసీఆర్ కొత్త సెక్ర‌టేరియ‌ట్ మోడ‌ల్ రెడీ...ఆ రెండే అస‌లు స‌మ‌స్య‌లు
సీఎం జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌నం...అమ్మ ఒడిపై కీల‌క నిర్ణ‌యం....
బీజేపీలోకి మ‌రో ఇద్ద‌రు మాజీ కేంద్ర‌మంత్రులు...ఎందుకు వారికి కండువా అంటే
సెకండ్ హ్యాండ్ వాహ‌నాలకు క్రేజ్‌...కొత్త వాటి కంటే ఎక్కువ గిరాకీ ఎందుకంటే...
కొత్త‌గా వ్యాపారం పెడుతున్నారా...ఇదిగో గుడ్ న్యూస్‌
సుజ‌నాకు బీజేపీ మొద‌టి షాక్‌..అనుకున్న‌ది ఒక‌టి...అయింది మ‌రొక‌టి
డీల్ ఓకే...కోమ‌టిరెడ్డి జంప‌య్యే తేదీ ఇదే...అమిత్‌షాతోనే అస‌లు స‌మ‌స్య‌
మ‌రో సంచ‌ల‌న స్కాం...బాబు అవినీతి బ‌ట్ట‌బ‌యలు..స‌న్నిహిత మంత్రితో..
ఢిల్లీలో ప్రత్యేక హోదా లక్ష్యంగా..విజయసాయికి మరో కీలక పదవి!
పీకేకు కొత్త క్ల‌యింట్ దొరికాడు...కానీ అస‌లు స‌మ‌స్య అదే
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.