కేంద్రం తీరుపై, కొంద‌రు అధికారుల వ్య‌వ‌హ‌ర‌శైలిపై....ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ వ‌ద్దే ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అసహ‌నం వ్య‌క్తం చేశారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అవినీతిపై ఘాటుగా స్పందించేలా తాము వ్య‌వ‌హ‌రిస్తుంటే...ఎందుకు కొంద‌రు అధికారులు విభిన్నంగా స్పందిస్తున్నారని ఘాటుగా ప్ర‌శ్నించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలను అవసరం అయితే రద్దు చేస్తామని ఇటీవ‌ల సీఎం జగన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై కేంద్ర ఇంధన శాఖ స్పందిస్తూ..జ‌గ‌న్ నిర్ణ‌యం రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు విఘాత‌మ‌ని పేర్కొంది. ఈ విష‌యం ఉప‌సంహ‌రించుకోవాల‌ని కోరి ఈ మేర‌కు ఓ లేఖ‌లో జ‌గ‌న్‌కు హిత‌వు ప‌లికింది. దీనిపై మోదీ వ‌ద్ద జ‌గ‌న్ ఘాటుగా స్పందించిన‌ట్లు తెలిసింది.


సాంప్రదాయేతర ఇంధన ధరలను గత ప్రభుత్వం ఎక్కువగా నిర్ణయించిందని ఆరోపిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి...మూడు, మూడున్నర రూపాయలు ఉండే యూనిట్ ధరను ఆరు రూపాయలకు పైగా పెంచి కొన్నారని వెల్ల‌డించారు. దీంతో కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి లేఖ రాశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) సమీక్షించాలని సీఎం జగన్ నిర్ణయించగా... పీపీఏల సమీక్ష మంచిది కాదంటూ ఏపీ సీఎస్‌కు కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఇలా చేయడం వల్ల పరిశ్రమలు రావని, పెట్టుబడి దారులు భయపడతారని ఇంధన శాఖ కార్యదర్శి లేఖలో పేర్కొన్నారు.  పీపీఏలను సమీక్షిస్తామన్న సీఎం జగన్ వ్యాఖ్యలను టీవీల్లో, పేపర్లలో చూసి లేఖరాస్తున్నానని.. తన లేఖను సీఎం జగన్‌కు చూపించాలని సీఎస్‌కు ఇంధనశాఖ కార్యదర్శి సూచించారు.


కేంద్ర ప్ర‌భుత్వ ఇంద‌న శాఖ కార్య‌ద‌ర్శి  లేఖను ఏపీ సీఎం సీరియస్‌గా తీసుకున్నారు. తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా.. ఇంధన కార్యదర్శి రాసిన లేఖను ప్రధానికి చూపించారు. దీనిపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ... తప్పు జరిగినప్పుడు సమీక్షించడంలో తప్పేముందని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. మరోవైపు, మొత్తానికి, వెనక్కి తగ్గని ఏపీ సీఎం.. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునర్ సమీక్షించనున్నారు. త‌ద్వారా ఆయ‌న బాబు అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: