ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించింది.  ముఖ్యమంత్రిగా యువ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు.  మొదటి కేబినేట్ మీటింగ్ లో ఎన్నో కీలక అంశాలపై చర్చలు జరిపారు.  మరెన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.  ఇక  ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.


కొత్త ప్రభుత్వం హయాంలో తొలి అసెంబ్లి  సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 11.05 గంటలకు అసెంబ్లి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదురోజులపాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా  ఎమ్యెల్యే ల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్న ప్రొటెం స్పీకర్ అప్పల నాయుడు.


ఎల్లుండి స్పీకర్ గా తమ్మినేని సీతారాం ను అధికారికంగా ఎన్నుకొనున్న శాసన సభ..ఈ నెల 14న ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్...
ఈ నెల 15,16 తేదీల్లో సభకు సెలవు..ఈ నెల 17,18 న జరగనున్న అసెంబ్లీ..ఈ నెల 18 తో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: