ఇటీవల పసిమొగ్గలు హదయవిదారక పరిస్థితుల్లో నేల రాలిపోతున్నారు.
తప్పిపోయినవారు చిన్నపిల్లలయితే పరిస్థితి మరింత దయనీయం.
ఎక్కడున్నారో తెలియదు. ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు, అసలు తిరిగి వస్తారో, రారో కూడా తెలియదు. అలికిడైతే చాలు వాకిట్లోకి తొంగిచూస్తూ.. పట్టించుకోకపోయినా క్రమం తప్పకుండా పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతూ నిత్యం నరకం అనుభవిస్తుంటారు. 

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సగటున రోజుకు 60 మంది వరకు కనిపించకుండా పోతున్నట్టు ఒక అంచనా... హాజీపూర్‌ ఉదంతం బయటపడిన తర్వాత, మిస్సింగ్‌ కేసులను దుమ్ముదులిపి వెలికి తీసిన పోలీసులు పరిస్థితి సద్దుమణగగానే మళ్లీ దాని మీద దృష్టి పెట్టలేదు. దీంతో రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న మిస్సింగ్‌ కేసులు హడలెత్తిస్తున్నాయి. జూన్‌ నెలలో దాదాపు 500 మంది కనిపించకుండాపోయినట్టు తెలుస్తోంది. ఇంతమంది ఎందుకు కన్పించకుండా పోతున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇది బాధితుల కుటుంబ సభ్యులనే కాదు పోలీసులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది.

తమ బిడ్డ కనిపించకుండా పోతే ఆ కుటుంబం పరిస్థితి దయనీయం. పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతూ తమవారిని వెతికి పెట్టమని ప్రాధేయపడుతున్నారు. మాయమవుతున్న వారిలో పసిపిల్లల నుంచి వ ద్ధుల వరకూ ఉంటున్నారు. ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి హతమార్చిన హజీపూర్‌ ఉదంతం ఇంకా మరుగునపడకముందే పెరిగిపోతున్నమిస్సింగ్‌ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. జూన్‌ నెల మొదటి వారంలో రాష్ట్రంలో 545 మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయి. నమోదు కాని కేసులు మరికొన్నయినా ఉంటాయని అంచనా.

  ఏవో కొన్ని కేసులలో తప్ప సోలీసులు చాలావరకూ ఒకటి రెండురోజులు దర్యాప్తు చేసి ఆ తర్వాత పక్కనపెట్టేస్తున్నారు. దాంతో బాధితులతల్లిదండ్రులకు అంతులేని వేదన కలుగుతోంది. ఇందుకు భువనగిరి జిల్లా హాజీపూర్‌ ఉదంతమే నిదర్శనం. ఒక హంతకుడు ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి హతమార్చి బావిలో పూడ్చిపెట్టిన ఉదంతం ఇటీవల సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. తమ కుమార్తె కనిపించడంలేదని 2015 ఏప్రిల్‌ 23న తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడే పోలీసులు సరిగా స్పందించి ఉంటే హంతకుడు దొరికేవాడు, ఆ తర్వాత జరిగిన మరో ఇద్దరు అమ్మాయిల హత్యలకు ఆస్కారమే ఉండేది కాదు. గత ఏప్రిల్‌లో హాజీపూర్‌లో అద్యశ్యమైన శ్రావణి కేసులో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. చివరకు గ్రామస్థులే బాలిక మతదేహాన్ని కనుగొన్నారు.
తప్పిపోయిన వారు యుక్తవయసు వారయితే ప్రేమవ్యవహారాల కారణంగానే వెళ్లిపోయినట్లు భావిస్తూ అసలు పట్టించుకోవడంలేదు. 

ఎందుకిలా జరుగుతోంది ?
 1, మిస్సింగ్‌ కేసులలో ఎక్కువశాతం , ప్రేమ వ్యవహారాలు ఉంటున్నాయి.. ఇలాంటివే ఉంటున్నాయి.
 2, పరీక్ష ఫలితాల సమయంలో ఎక్కువగా మిస్సింగ్‌ కేసులు నమోదవుతుంటాయి. ఇలా వెళ్లిన పిల్లల్లో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా తిరిగి వచ్చేస్తుంటారు.
 3, పెద్ద వారయితే అప్పులు, ఇతర ఆర్థిక కారణాల వల్ల ఎవరికి చెప్పకుండా వెళ్లిపోతున్నారు. 
4, సినిమాల మీద మోజుతో కొందరు యుక్త వయసు వారు ఇంటి నండి చెప్ప కుండా వచ్చి అపరిచితుల చేతిలో చిక్కుకుంటున్నారు. 
5, కొన్ని అపహరణ ముఠాలు తిరుగుతుంటాయి. యుక్తవయసు బాలికలు వీరి బారిన పడి మోస పోతున్నారు. 
ముందు జాగ్రత్తలు...

 పరీక్షల్లో తప్పిన పిల్లల పట్ల తల్లిదండ్రులు సున్నితంగా వ్యవహరించి వారిలో ఆత్మవిశ్వాసం కలిగించాలి, తప్ప వారిని బాధించ కూడదు. 
యుక్త వయస్సు అమ్మాయిలు తెలీని ప్రదేశాలకు వెళ్లినపుడు అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
వారిని ఎవరైనా వెంబడిస్తున్నట్లు అనుమానం ఉంటే తల్లిదండ్రులకు తెలియ చేయాలి.
 విద్యార్దులు చదువు మీద దృష్టి పెట్టాలి తప్ప,సినిమాలు,సీరియల్స్‌లో నటించాలనే ఆలోచనలకు దూరంగా ఉండాలి.
ఒక వేళ మీలో నటించే ప్రతిభ ఉంటే తల్లిదండ్రుల ద్వారా అవకాశాలు వెతకాలి తప్ప ఒంటరిగా ప్రయత్నాలు చేయడం చాలా ప్రమాదం.
pic credits /google images  


మరింత సమాచారం తెలుసుకోండి: