ఏపీ ముఖ్యమంత్రిగా గత ఐదేళ్ల హయాంలో చంద్రబాబు ఎంతగా దుబారా ఖర్చు పెట్టారో చూశాం. పనిలేకపోయిన రాజధాని డిజైన్లు పేరుతో మంత్రులు, అధికారులను వేసుకుని ప్రపంచంలోని దేశాలన్నీ తిరిగిరావడం, ప్రయాణ ఖర్చులు దగ్గర నుంచి తిండి ఖర్చుల వరకు ప్రతీది అడ్డగోలుగా ఖర్చుపెట్టడం బాబుగారికి అలవాటుగా మారింది.  ఆఖరికి మంత్రిమండలి సమావేశాలు కూడా ఏ ఫైవ్ స్టార్ హోటల్లోనే పెట్టేవారు. చంద్రబాబు చేసిన దుబారా ఖర్చులతో ఏపీలో ఏకంగా ఓ సాగునీటి ప్రాజెక్టు కట్టవచ్చు అని చెప్పినా అతిశయోక్తి లేదు..ఎందుకంటే కాదేది దుబారాకనర్హం అంటూ ప్రజలసొమ్మును నీళ్లలా ఖర్చుపెట్టి..రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించాడు చంద్రబాబు. అయితే ఏపీ నూతన ముఖ్యమంత్రిగా జగన్ ప్రజల సొమ్మును పొదుపుగా ఖర్చుపెడుతూ అందరి మన్నలను పొందుతున్నారు.

2014లో సీఎంగా తన  ప్రమాణస్వీకార మహోత్సవానికి చంద్రబాబు 25 కోట్లు ఖర్చుపెడితే 2019లో ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ తన ప్రమాణస్వీకారానికి కేవలం 49 లక్షలే ఖర్చుపెట్టారు.  అలా తొలి కార్యక్రమంలోనే పొదుపు పాటించిన జగన్ ప్రతి పనిలోను ఖర్చు తగ్గిస్తున్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రతి రోజు ఖరీదైన హిమాలయ వాటర్ బాటిల్స్‌నే ఉపయోగిస్తే జగన్ మాత్రం మామూలుగా మనమందరం తాగే రూ. 10/- విలువైన వాటర్ బాటిల్‌నే వినియోగిస్తున్నారు. ఇక మంత్రివర్గ సమావేశాలను, పార్టీ సమావేశాలను చంద్రబాబులా లక్షలు ఖ‌ర్చుపెట్టి  ఖరీదైన హోటళ్లలో నిర్వహించకుండా సచివాలయంలోనో, లేకుంటే తన ఇంటిలోనో నిర్వహిస్తున్నారు.

సీఎంగా తన పదవీ బాధ్యతలు చేపట్టకముందు అధికారులతో తన నివాసంలోనే సమీక్షలు జరిపిన జగన్ వారికి సైతం లంచ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భోజనానికి టైమ్ అయితాంది..రండి..తిన్నాక మాట్లాడుకుందామంటూ జగన్ పిలవడం అధికారులను ఆకట్టుకుంది. తాను ఏం తింటాడో అధికారులకు కూడా అదే పెట్టాలని తన సిబ్బందికి చెప్పడం జగన్ మంచిమనసుకు నిదర్శనం. జగన్ చూపిన ఆప్యాయత, ఇచ్చిన ఆతిధ్యం చూసి జన్మలో ఇలాంటి సీఎంను చూడలేదంటూ అధికారులు అంటున్నారు.  


తాజాగా జూన్ 10 న జరిగిన తొలి కేబినెట్ సమావేశం సందర్భంగా సీఎం హోదాలో జగన్ మంత్రులకు, అధికారులకు లంచ్ ఏర్పాటు చేయించాడు. చంద్రబాబు హయాంలో లాగా పంచభక్ష పరమాన్నాలు, పదుల సంఖ్యలో వెరైటీలు ఉంటాయని ఆశపడిన మంత్రులకు, అధికారులకు జగన్ ఏర్పాటు చేయించిన లంచ్ చూసి షాక్ కొట్టినట్లయింది. జగన్ కేవలం రెండే రెండు వంటకాలు రెడీ చేయించాడు. అందులో ఒకటి బిసిబిలా బాత్, రెండు పెరుగున్నం. సీఎం జగన్ స్వయంగా ఈ రెండింటినే లంచ్‌లో తీసుకున్నారు. దీంతో మంత్రులు, అధికారులు కూడా బిసిబిలా బాత్, పెరుగున్నంతో సరిపెట్టుకున్నారు.

అయితే చంద్రబాబులా దుబారా ఖర్చు చేయకుండా , ప్రతీ విషయంలో పొదుపుగా వ్యవహరిస్తున్న జగన్ ఆఖరికి ఫుడ్ విషయంలో మాత్రం మరీ పిసినారితనం చూపిస్తారని మంత్రులు సరదాగా జోకులు వేసుకున్నట్లు సమాచారం. అయితే ప్రజల సొమ్ము దుబారా కాకుండా ప్రతి విషయంలో ఖర్చు తగ్గిస్తున్న సీఎం జగన్‌ గ్రేట్ అంటూ..ఇక నుంచి తాము కూడా తమ మంత్రిత్వ శాఖలలో ఏమాత్రం దుబారా కాకుండా చూసుకోవాలని మంత్రులు తమలో తాము అనుకున్నట్లు సమాచారం. మొత్తానికి తిండి విషయంలో కూడా పొదుపు మంత్రం పాటిస్తూ ఓ సామాన్యుడిలా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న యువ ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: