వైఎస్ జగన్ లోని విలక్షణత ఎంతో ఉంది.  అయితే ఆయన నిన్నటివరకూ పార్టీ వారికి పరిచయస్తుడు. ఇపుడు మొత్తం అయిదు కోట్ల జనాలకు బాధ్యుడు. పాలించే పెద్ద. ఆయనలోని భిన్న కోణాలు ఇపుడు అందరికీ తెలుస్తున్నాయి. ఆశ్చర్యపరుస్తున్నాయి. జగన్ అంటే అలా ఇలా అని రాసిన వ్యతిరేక మీడియా కధనాలు వట్టివేనని కూడా స్పష్టంగా తెలిసిపోతున్నాయి. ఆ అబద్దాల మబ్బులు తొలగిపోతున్నాయి.


తెలుగు భాషా ప్రేమికుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు అయిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పెద్దల సభలో తెలుగు పెద్ద  పేరు మీద డాక్టర్ సి నారాయణరెడ్డి గారి పార్లమెంట్ ప్రసంగాలపై  రాసిన పుస్తకాన్ని ఈ రోజు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ ఆఫీసులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన యార్లగడ్డ జగన్ భవిష్యత్తులో గొప్ప నాయకుడు అవుతాడని చెప్పారు. వైఎస్సార్ లోని పట్టుదల, కార్యదీక్ష, ఎంటీయార్ లోని పసితనం, మంచితనం జగన్ లో నిండుగా ఉన్నాయని అన్నారు.


 ఆ ఇద్దరు మహా నేతల వారసుడు జగన్ అంటూ కొనియాడారు. నిజంగా ఇది గొప్ప ప్రశంసే అనిపిస్తుంది. తెలుగు వారికి అన్న నందమూరి, వైఎస్సార్ ఇద్దరూ అంటే దేవుళ్ళతో సమానం. వారి ఉమ్మడి వారసుడు జగన్ అనడం అంటే నిజంగా జగన్ లోని గొప్ప నాయకత్వాన్ని, ఆయనలోని విభిన్న కోణాన్ని ఆవిష్కరించినట్లుగానే భావించాలి.  ఇక అప్పట్లో వైఎస్సార్ తో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు యార్లగడ్డ పుస్తకావిష్కరణ చేయించారు. 


ఇపుడు ముఖ్యమంత్రిగా జగన్ ఉండగా పుస్తకం ఆవిష్కరించారు. యార్లగడ్డ ఇలా తండ్రీ కొడుకులు ఇద్దరితోనూ ప్రేమానుబంధం పెంచుకున్న తీరు కూడా ప్రశంసనీయమే. ఇక  ఈ సభలో సుప్రీం కౌర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ వంటి పలువురు పెద్దలు సైతం జగన్ పది కాలాల పాటు ముఖ్యమంత్రిగా మంచి పాలన ఏపీకి ఇవ్వాలని దీవించడం విశేష పరిణామం.


మరింత సమాచారం తెలుసుకోండి: