రాష్ట్రంలో ఆ జిల్లా ఈ జిల్లా అని తేడాలేదు. ప్ర‌తి జిల్లాలోనూ ప్ర‌స్తుతం ఇదే మాట వినిపిస్తోంది. ప్ర‌తి ఒక్క‌రూ అధికార పార్టీ నాయ‌కుడు, సీఎం జ‌గ‌న్‌కు జేజేలు ప‌లుకుతున్నారు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ నిర్ణ‌యాలు తీసుకోవ‌డం, దూకుడుగా ముందుకు వెళ్ల‌డం వంటివి ప్ర‌జ‌ల‌కు బాగా న‌చ్చాయ‌నే చెప్పాలి. మ‌రోప‌క్క‌, గ‌త ముఖ్య‌మంత్రి మాదిరిగా ప్ర‌తి విష‌యాన్నీ ప్ర‌చారం చేసుకోవ‌డం, ప్ర‌తి విష‌యానికి గొంతు చించుకుని వివ‌రించ‌డం వంటివి జ‌గ‌న్ ఎక్క‌డా చేయ‌డం లేదు. ప్ర‌తి ఒక్క ప‌నినీ స్మూత్‌గా సుత్తి లేకుండా చేసుకుపోతున్నారు. 


తాను చేయాల్సింది చేస్తూ. త‌న టీంని ఎక్క‌డా బెస‌గ‌కుండా ప‌నిచేయిస్తున్నారు దీంతో జ‌గ‌న్‌కు కేవ‌లం ప‌ది రోజుల్లో బెస్ట్ సీఎం అనే ముద్ర ప‌డింద‌నే టాక్ వ‌స్తోంది. సీఎంగా ఆయ‌న ప్ర‌మాణం చేసిన రోజునే రాష్ట్రంలోని అవ్వ‌, తాత‌ల‌కు నెల‌కురూ.2250 పింఛ‌న్ ఇచ్చే ఫైలుపైనే సంత‌కం చేశారు. ఇదిగ్రామ గ్రామానికి పాకింది. అదేస‌మ‌యంలో పింఛ‌ను వ‌య‌సును 65 నుంచి 60 ఏళ్ల‌కు త‌గ్గించ‌డం మ‌రింత ప్ల‌స్ అయింది. గ్రామాణ ప్రాంతాల‌ను బ‌లోపేతం చేసే దిశ‌గా పంచాయితీల‌పై జ‌గ‌న్ దృష్టి పెట్టారు. దీంతో ఆయ‌న‌కు అతి త‌క్కువ కాలంలోనే ఎక్క‌వ ఇమేజ్ వ‌చ్చింది. 


ప్ర‌స్తుతం త‌న మంత్రి వ‌ర్గంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ‌ర్గాల‌కు పెద్ద‌పీట వేయ‌డం కూడా జ‌గ‌న్‌కు పూర్తిస్థాయిలో క‌లిసి వ‌చ్చింద‌నే టాక్ వినిపిస్తోంది. ఐదుగురు డిప్యూటీ సీఎంల‌పై తొలుత విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ఆయా సామాజిక వ‌ర్గాల్లోని వారు మాత్రం త‌మ‌కు సీఎం జ‌గ‌న్ ఇచ్చిన ప్ర‌త్యేక గుర్తింపుగా భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో కొత్త‌గా బాద్య‌తలు చేప‌ట్టిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ దూకుడుకు ప్ర‌జ‌లు ఫిదా అవుతున్నారు. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణ‌యాల‌పై కూడా ప్ర‌జ‌ల్లోని అన్ని వ‌ర్గాలు కూడా హ్యాపీగానే ఫీల‌వుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా జ‌య‌హో జ‌గ‌న్ నినాదం మార్మోగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: