టిడిపి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు హయాంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్ని సమీక్షిస్తామంటూ ఏపీ సీఎం జగన్ చెప్పటం తెలిసిందే. అయితే, ఇలా చేస్తే,  పెట్టుబడిదారుల్లో భయం కలుగుతుందని, ఫలితంగా పెట్టుబడులు పెట్టేందుకు వారు వెనుకాడే అవకాశం ఉందంటూ భయపెట్టే ఆలోచనను ప్రదర్శించారు. పెట్టుబడిదారుల వలన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తింటే - వారు పెట్టుబడి దారులే కాదు.


వ్యాపారంలో ఉభయత్రా ప్రయోజనం కలగాలి. ప్రజా ప్రయోజనాలు దెబ్బ తీసే వారు మనవద్దకు వ్యాపారం చేయటానికి వస్తే ఎంత?  రాకపోతే ఎంత?  అయినా, వ్యాపారం లో ఎప్పుడూ విన్ టు విన్ పరిస్థితి ఉండాలి కానీ, రాష్ట్రం ప్రయోజనాలు బలై పోవటం జరిగి వారికే లాభాలు వస్తే చాలనే తత్వం అర్థం లేనిది.


చంద్రబాబు హయాంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్రకారం యూనిట్ కు ₹ 6/- కొనుగోలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో విద్యుత్ ధర యూనిట్ కు ₹3/- నుంచి ₹3/50 వరకు ఉంది. లక్షలాది యూనిట్లు కొనుగోలు చేస్తున్నప్పుడు ఈ వ్యత్యాసం రాష్ట్ర ఖజానాపై పడే భారం అత్యంత భరించరానిదిగా ఉంటుంది. 
Image result for jagan with modi
ఈ నేపథ్యంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్ని సమీక్షించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అయితే, కేంద్ర ఆర్థికశాఖ ఈ విషయంలో సమీక్ష వద్దన్నట్లుగా సంకేతాలు పంపటంతో, ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి సీఎం వైఎస్ జగన్ తీసుకెళ్లినట్లుగా సమాచారం. చంద్రబాబు ప్రభుత్వహయాంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను సమీక్షించటం ద్వారా, భారీ ఖర్చును తగ్గించ వచ్చని రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందన్న విషయాన్ని చెప్పినట్లుగా తెలుస్తోంది.


తిరుపతి పర్యటన సందర్భంగా ఆయన చెప్పిన మాటలకు ప్రధాని సైతం సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. కేంద్ర అధికారులు మోకాలడ్డుతున్న వైనాన్ని పట్టించుకోకుండా "అలాగే ముందుకెళ్ళండి" (గోహెడ్) అంటూ ప్రధాని పచ్చజెండా ఊపేసినట్లు తెలుస్తుంది. విద్యుత్ ఒప్పందాల్ని పునఃసమీక్షిస్తే, చంద్రబాబుకు బిగ్-బ్యాండే అన్నఅభిప్రాయం పలువురి నుండి వ్యక్తమౌతుంది. ఒప్పందాల లోతుల్లోకి వెళితే, ప్రయోజనం పొందేవాళ్ళు ఎవరు? కమీషన్ల మాయాజాలం ఏమిటీ? లాంటి వంద లాది ఆసక్తికర అంశాలు వెల్లువలా బయటకు వస్తాయనేది విశ్లేషకుల అభిప్రాయం.  


మరింత సమాచారం తెలుసుకోండి: