రెండవ సారి వైఎస్ఆర్ సీపీ కాంగ్రెస్ పార్టీ తరపున నగరి ఎమ్మెల్యేగా ఆర్ కే రోజా గెలిచారు. రాష్ట్రంలో ఏర్పాటైన జగన్ ప్రభుత్వం రోజా కూడా మంత్రి పదవి ఇస్తారని ఆసతో ఉన్నారు. మంత్రుల ఎవరని ప్రకటించడంతో ఆయనపై రోజా అలిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏపీ కొత్త మంత్రి వర్గంలో వైసీపీ ఎమ్మల్యే రోజాకు స్థానం దక్కని విషయం తెలిసిందే.

అలక పూనిన రోజాకు సీఎం జగన్ ఫోన్ చేసి ఈరోజు విజయవాడకు రావాలని ఆదేశించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కొద్ది సేపటి క్రితం విజయవాడకు రోజా చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, తనను ఎవరూ అమరావతికి రమ్మనమని చెప్పలేదని అన్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల కోసం తానే ఇక్కడికి వచ్చానని చెప్పారు. తనకు మంత్రి పదవి దక్కలేదన్న బాధ లేదని, కులాల సమీకరణ కారణంగానే తనకు పదవి దక్కలేదని చెప్పుకొచ్చారు.

రోజాకు నామినేటెడ్ పోస్ట్ లభిస్తుందంటూ వస్తున్న వార్తలపై ఆమె స్పందిస్తూ, ఈ పదవులు ఇస్తామని తనకు ఎవరూ చెప్పలేదని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రోజా హాజరుకాకపోవడంపై విలేకరులు ప్రశ్నించగా.. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేల హాజరు అవసరం లేదని, అందుకే, హాజరు కాలేదని స్పష్టం చేశారు. మంత్రి పదవులు దక్కించుకున్నవారికి రోజా శుభాకాంక్షలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: