ఆంధ్రప్రదేశ్ లో నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి రోజు నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. సమర్థవంతమైన అధికారులను నియమిస్తున్నారు..ప్రజలకు సుపరిపాలన అందించేందుకు అన్ని రకాల చర్యలు కొనసాగిస్తున్నారు.  ప్రజలకు ఉపయోగపడే పథకాలు అమలు చేస్తున్నారు..అసలు సీఎం జగన్ పట్టుమని పదిరోజులు కూడా కాలేదు..ఏంటీ దూకుడు అని ప్రత్యర్థి పార్టీ నేతలు ముక్కున వేలు వేసుకునేలా చేస్తున్నారు.  అంతే కాదు ఆయన కేబినేట్ లో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించారు.

ఇక ఏపి లో మొదటిసారిగా ఓ మహిళను హోమంత్రిగా చేశారు.   ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె కూడా తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.  రాజకీయ ప్రతీకార దాడులు అన్నవి మంచివి కాదని ఎవరైనా హింసకు దిగితే, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తాట తీస్తామని..ఈ ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేయాలనుకుంటుందని..వాటికి విఘాతం కలిగిస్తే సహించబోమని హెచ్చరించారు.  పోలీసులపై 24 గంటల పనిభారాన్ని తగ్గించడాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

గుంటూరులోని ఆర్ అండ్ బీ అతిథిగృహంలో ఈరోజు సుచరిత మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి భద్రత లేదని విమర్శలు వచ్చాయని..ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలకు సంబంధించిన పలు అంశాలపై వీరిద్దరూ చర్చించారు. కాగా, డీజీపీ కార్యాలయాన్ని సందర్శించాలని గౌతమ్ సవాంగ్ కోరగా, అందుకు హోంమంత్రి సానుకూలంగా స్పందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: