Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 3:17 pm IST

Menu &Sections

Search

పురాతన నాణేలతో ప్రధాని కోసం జ్ఞాపిక తయారీకి యత్నం! టీటీడీకి ముందే ఎదురుదెబ్బ

పురాతన నాణేలతో ప్రధాని కోసం జ్ఞాపిక తయారీకి యత్నం! టీటీడీకి ముందే ఎదురుదెబ్బ
పురాతన నాణేలతో ప్రధాని కోసం జ్ఞాపిక తయారీకి యత్నం! టీటీడీకి ముందే ఎదురుదెబ్బ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నరేంద్ర మోదీ తొలిసారి తిరుమల శ్రీవారి దర్శనానికి గత ఆదివారం విచ్చేసిన విషయం తెలిసిందే. అయితే, శ్రీవారి దర్శనానికి విచ్చేసిన ప్రధానికి ఒక అరుదైన ౙ్నాపిక ను (మొమెంటో) బహూ కరించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ప్రయత్నించినట్టు తెలిసింది. బహు పురాతన నాణేలతో దానిని తయారు చేయించేందుకు సిద్ధపడటంతో అది వివాదానికి కారణం అవుతోంది. అధికారుల అత్యుత్సాహంతో టీటీడీ మ్యూజియంలోని 14, 15 శతాబ్దాల నాటి పురాతన నాణేలు, పలు రకాల ఆకృతులతో ఉన్న కొన్ని నమూనాల వినియోగించి ఒక  జ్ఞాపికను తయారీ చేసే పనిని బయట వ్యక్తులకు పురమాయించారు. 


ఇందుకు సంబంధించి గత శనివారమే, అంటే నరేంద్ర మోడీ తిరుపతి విచ్చేసే ఒక రోజు ముందు ఙ్జాపిక తయారీదారుల కు నాణేలను అందజేసింది. వీటితో అందంగా, ఆకర్షణీయంగా  ఙ్జాపిక తయారు చేయాలని ఆదేశించారు. ఆదివారం శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రధానికి దీనిని అందించి అత్యుత్తమ బహుమతి గా ఆయనకు పరిచయం చేయాలని భావించినట్లు తెలుస్తోంది.  కానీ, మ్యూజియంలో ఉండాల్సిన విలువైన నాణేలు బయటకు రావడం, ఈ వార్త మీడియాకు చేరడంతో టీటీడీ వెనక్కు తగ్గింది. దీంతో ఈ ప్రతిపాదనను అధికారులు విరమించుకున్నట్లు సమాచారం. 

ttd-memento-vivadam-to-pm

టీటీడీ అత్యుత్సాహంపై ప్రజా సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. టీటీడీ అధికారులు చేసిన ప్రయత్నాల గురించి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తామని అంటున్నారు. ఏవరైనా ప్రముఖులు స్వామివారి దర్శనం కోసం తిరుమల వస్తే వారికి మహాద్వారం నుంచి ఆలయం ప్రవేశం కల్పిస్తారు. దర్శనానంతరంరంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం పలుకుతారు. తర్వాత, టిటిడి ఈవో, జెఈవో కలిసి శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేస్తారు. దీనికి భిన్నంగా  ప్రధానికి సహస్రాబ్ధాలనాడు ఏవరో చక్రవర్తులు బహూకరించిన విలువైన నాణేలతో తయార చేసిన ఙ్జాపికను  అందజేయడానికి ప్రయత్నించడం వివాదానికి తెరతీసింది.


అసలు ఇప్పటికీ టిటిడీలో కొనసాగుతున్న గత ప్రభుత్వ నామినేటెడ్ పదవులను అలంకరించిన వాళ్ళ వ్యూహం ఈ నేపధ్యం లో ఉండవచ్చని తద్వారా వీలైతే ప్రధానిని ఆయన వెన్నంటి ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రిని బదనాం చేసే ప్రణాళిక ఉండి ఉండొచ్చని అంటున్నారు వారి తరహా విధానం తెలిసిన సూక్ష్మ గ్రాహకులు. అంతేకాదు ఆ దేవదేవునికి పురాతన కాలములో సార్వభౌములు చక్రవర్తులు రాజులు సామంతులు సమర్పించిన విలువైన కానుకలు ఈ రూపాల్లో బయటకు వెళ్ళిన సందర్భాలపై కూడా విచారణ జరిపించాలి అని శ్రీవారి భక్తులు ముఖ్యమంత్రిని కోరుకుంటున్నారు. 


ttd-memento-vivadam-to-pm
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడిటోరియల్: పవన్ కల్యాణ్ ని నమ్మేదెలా? మళ్ళీ ప్రశ్నిస్తానంటున్నాడు? ఎవరిని?
రాహుల్ గాంధి స్థానంలో  కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడు ఇక  అశోక్ గెహ్లోత్‌?
దక్షిణాదిన కమల వికాసం - పసుపు మాయం - గులాబి క్రమంగా మాయం - కర్ణాటకలో కమలం?
పంచేంద్రియాలపై పట్టు సాధించటమే జితేంద్రియం
ఆంధ్రప్రదేశ్ ఎంపిల గోడదూకుడు వ్యవహారం బిజేపికి మేలు చేస్తుందా?
బోల్డ్ బోల్దర్ బోల్డెస్ట్ అమలా పాల్ - "ఆడై" టీజర్ సంచలనం
ఎడిటోరియల్: స్పీకర్ తమ్మినేని - సీఎం జగన్ - తొలి అసెంబ్లీలోనే తమను ఋజువు చేసుకున్నట్లే!
నేటి టిడిపి దుస్థితే - రేపు టీఆరెస్ కు పట్టవచ్చు
ప్రజా సానుభూతి కోల్పోయిన ఏ నాయకుడి గతైనా ఇంతే - ప్రజావేదిక ప్రభుత్వ స్వాదీనం
సొమ్మొకడిది సోకొకడిది - కష్టం హరీష్ ది - సోకు బంగరు కుటుంబానిది - ఇదీ కాళేశ్వరం కథ
About the author