ఆ మద్య లారెన్స్, ప్రభుదేవ కాంబినేషన్ లో వచ్చిన ‘స్టైల్’సినిమాలో డ్యాన్స్ అనేది ఒక వరం..అది ఎవరి సొత్తు కాదు..దమ్మున్నోడు డ్యాన్స్ లో ఇరగదీస్తడు..కళ అనేది దేవుడు ఇచ్చిన వరం అని డైలాగ్స్ అప్పట్లో యూత్ లో విపరీతమైన క్రేజ్ తీసుకు వచ్చింది.  ప్రస్తుతం ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు డ్యాన్స్ మాస్టార్లుగా మారి జీవనం కొనసాగిస్తున్నారు.  కొరియోగ్రఫర్లుగా వచ్చిన లారెన్స్, ప్రభుదేవ ఇప్పుడు నటులు, దర్శకులుగా మారి తమ సత్తా చాటుతున్నారు. 


అయితే ప్రపంచంలో ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. అయితే అతి కొద్ది సందర్భాల్లో మాత్రమే అది బయటపడుతుంటుంది. తాజాగా ఎల్‌ అండ్‌ టీ సంస్థకు చెందిన ఓ కార్మికుడు చేసిన డ్యాన్స్ కి సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మెట్రోరైల్‌ పనుల్లో భాగంగా ఓ కార్మికుడు భోజన విరామ సమయంలో సరదాగా తన తోటి కార్మికుల మద్య మైకేల్ జాక్సన్ స్టెప్పులు వేసి తన డ్యాన్స్ తో పిచ్చెక్కించాడు. 


ఆ కార్మికుడు డ్యాన్స్ చేస్తున్న సమయంలో తోటి కార్మికుడు తీసిన వీడియోను  హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఆ వ్యక్తి సినిమా నటుడేమీ కాదని.. ఇలాంటి ప్రతిభ కలిగిన కార్మికులు ఉండడాన్ని తాను గర్విస్తున్నానంటూ ఆయన పేర్కొన్నారు. తాజాగా సోషల్‌ మీడియాలో ఆ కార్మికుడి డ్యాన్స్‌ చూసిన పలువురు నెటిజన్లు ఆయన్ను అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: