నూతన ముఖ్యమంత్రి గా బాధ్యతలను చెప్పట్టిన జగన్ తో బాబు గారు అధికారికంగా రేపటి నుండి కయ్యానికి కాలు దువ్వనున్నారు.అసెంబ్లీ సమావేశాలు రేపటి నుండి మొదల్వనున్నాయి.చంద్రబాబు, జగన్ ను ఈ సభలో ఎలా ఆడుకుంటారో అని రాష్ట్ర ప్రజలందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

తొలుత ముఖ్య మంత్రి జగన్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.తర్వాత ప్రతి పక్ష నేతగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 14 వ తేదీన గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

గతంలో టీడీపీ వారిలా సభను అడ్డగోలుగా జరిపి ప్రతిపక్షాల నోరును నొక్కబోమని. తాము చాలా హుందాగా సభను నిర్వహిస్తాం అని  ప్రభుత్వ విప్ ప్రకటించారు.ఇక అధికార పార్టీ రాష్ట్ర అభివృద్ది కోసం జరుగుతున్న పనులలో అవినీతి జరిగిందంటూ వాటిని ఆపేయబోతున్నారు.దానిని అడ్డుకోవడానికి టీడీపీ కార్యాచరణ సిద్దం చేసుకుంటుంది.

ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రభుత్వ మరియు ప్రతి పక్షాలు మధ్య వాదనలతో మొదటి రోజు నుండే వేడెక్కనున్నవి.


మరింత సమాచారం తెలుసుకోండి: