అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ సంక్షేమ పధకాలను తొలిగించి కొద్దిగా వాటిని మెరుగుపరిచి పేర్లను మార్చి మళ్ళీ అమలు చేయడం అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వాలు చేసే మొదటి పని.గతంలో ఇదే తరహా ధోరణని అధికారంలోకి వచ్చిన టీడీపీ మరియు కాంగ్రెస్ రాష్ట్రంలో అనుసరించాయి.ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వైసీపీ  ఈ ధోరణి అవలంబించడం కష్టమనే చెప్పాలి.

రాష్ట్ర ఖజనా ఖాళీ అవడం,అప్పులకు తెచ్చిన డబ్బులు అయిపోవడంతో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.దానితో గత ప్రభుత్వం పెట్టిన పథకాలను కొనసాగించడమా పై అన్ని శాఖల అధికారులతో సి.ఎస్ చర్చలు జరపబోతున్నారు.

ఈ బుధవారం సచివాలయంలో ప్రభుత్వ కార్యదర్శి ఎల్.వి. సుబ్రమణ్యం సమక్షంలో ఈ చర్చలు జరగనున్నాయి. ఆ చర్చల అనంతరం గత ప్రభుత్వ పధకాలను కొనసాగించడమ లేదా అని ఓ నిర్ణయానికి వస్తారు.కొనసాగించే పధకాలను మరియు ఆస్కారం ఉన్న కొత్త పధకాల పై నివేదికలు సిద్ధం చేసుకోనున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: