నితిన్ హీరోగా చేసిన ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలు మంచి హిట్ కొట్టాయి.  తరువాత కొన్ని సినిమాలు షరా మాములే.  ఆ తరువాత సమంతతో చేసిన అ ఆ సినిమా హిట్ అయ్యింది.  నితిన్ హీరో అయినా.. సమంత నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ హిట్టైంది.  

ఆ సినిమా హిట్ కేవలం సమంత కే చెందినా అందులో హీరోగా నటించిన నితిన్ ని కూడా పొగిడేశారు. అలా నితిన్ సమంత తో కలిసి నటించినందుకు అ… ఆ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.   

తన క్రేజ్ తో సూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన సమంత ఇప్పుడు మరో యంగ్ హీరోకి హెల్ప్ అవుతుందా?పెళ్లి తర్వాత ఫుల్ జోష్ లో ఉన్న సమంత తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ బేబీ సినిమాలో నటిస్తుంది. విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమాలో నాగ శౌర్య హీరో. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో మరో సీనియర్ నటి లక్ష్మి కూడా కీలక పాత్ర పోషిచింది. 

చాలా కాలం నుంచి హీరో నాగశౌర్య హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు.  ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్న ఈ యూత్ హీరోకు ఈ సినిమా సెట్ అవుతుందా లేదా అన్నది తెలియాలంటే జులై 12 వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: