``జ‌గ‌న్ దేవుడ‌య్యా! ఇంత‌లోనే ఇంత మంచి ప‌ని చేస్తాడ‌ని అనుకోల‌ద‌య్యా! జ‌గ‌న్‌కు ఒక్క అవ‌కాశం ఇమ్మ‌ని అడిగారు గా. అందుకే ఆయ‌న‌కు ఓట్లేశాం. కానీ, ఇంత త‌క్కువ టైంలో అట్టుడుగున ఉన్న మా జీవితాల‌ను ఇంత‌లా ఆదుకుంటా డ‌ని ఊహించేల‌ద‌య్యా!``- ఇది ఎవ‌రో అత్యంత రాజ‌కీయ పండితుడో, బాగా చ‌దువుకున్న మేధావో చెప్పిన మాట కాదు. కాయ‌క‌ష్టం చేసుకుని జీవించే అత్యంత‌ చిన్నస్థాయి వ్య‌క్తి, ముఖ్యంగా మ‌హిళ.. అందునా ఉద‌యాన్నే రోడ్ల‌పైకి వ‌చ్చి వాటి ని ఊడ్చి న‌గ‌ర ప‌రిశుభ్ర‌త‌ను కాపాడే ఓ మ‌హిళ అన్న మాట ఇది!


రాష్ట్రంలోని మునిసిపాలిటీల్లో ప‌నిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు కొన్నేళ్లుగా త‌మ‌కు న్యాయ‌మైన జీతాల‌ను ఇవ్వ‌మ‌ని కోరుతూ.. డిమాండ్లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో గ‌డిచిన  నాలుగు మాసాల కిందట రాష్ట్ర వ్యాప్తంగా నిర స‌న‌కు దిగారు. వారాల త‌ర‌బ‌డి ప‌నులు ఆపేసి.. ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. అయినా కూడా అప్ప‌టి ప్ర‌భుత్వం వీరి వేత‌న పెంపు వంటి డిమాండ్ల‌ను ప‌ట్టించుకోలేదు. ఏదో కంటి తుడుపు చ‌ర్య‌లు మాత్ర‌మే చేప‌ట్టింది. విధి లేని ప‌రిస్థితిలో, ఇది త‌ప్ప క‌డుపు నింపుకొనేందుకు మ‌రో ప‌నిలేక‌పోవ‌డంతో వారంతా త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డ్డారు. 


విధిలేని ప‌రిస్థితిలో ప‌నిలో చేరారు. ఇక అతి క‌ష్టం మీద చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నాలుగు నెల‌ల కింద ఎన్నిక‌ల ముంద వారికి రూ.11800 చొప్పున వేత‌నాల‌ను ఖ‌రారు చేసింది. అది కూడా ప‌నిచేసిన రోజుల‌కు మాత్ర‌మేన‌ని హుకుం జారీ చేసిం ది. అయితే, ఇప్పుడు వీరి త‌ల‌రాత‌లు మారాయి. రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్పాటై ప‌ది రోజులు కూడా కాక‌ముందుగా నే మునిసిప‌ల్ కాంట్రాక్టు కార్మికుల జీవితాల్లో దీపాలు పెట్టారు. వీరి వేత‌నాల‌ను రూ.18000ల‌కు పెంచారు. అంటే ఒక్క‌సారిగా వీరికి 6200 రూపాయ‌ల ల‌బ్ధి చేకూరింది. 


పైగా వీరికి నెల‌కుమూడు సెల‌వులు కూడా ప్ర‌క‌టించినట్టు స‌మాచారం. నిజానికి ఇదే ప‌ని చంద్ర‌బాబు చేసి ఉంటే.. భారీ ఎత్తున ప్ర‌చారం చేసుకునే అవ‌కాశం ఉండేది. కానీ, ప్ర‌చారాల‌కు , ఆర్భాటాల‌కు దూరంగా ఉన్న జ‌గ‌న్‌.. వీటిపై దృష్టి పెట్ట‌లేదు. కానీ, మౌత్ ప‌బ్లిసిటీ మాత్రం అదిరి పోతోంది. ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ‌లో రోడ్లు ఊడ్చే మ‌హిళా స్వీప‌ర్లు జ‌గ‌న్‌ను వేనోళ్ల కొనియాడుతున్నారు. సో.. మొత్తానికి జ‌నం మ‌న‌సును జ‌గ‌న్ గెలుచుకున్నాడ‌ని అంటున్నారు నాయ‌కులు.



మరింత సమాచారం తెలుసుకోండి: