తమిళనాడులో రాజకీయం చాలా విచిత్రంగా ఉంటుంది.  అక్కడ ప్రధానంగా ఉన్నది రెండు ద్రావిడ పార్టీలు.  ఒకటి అన్నాడీఎంకే.  రెండోది డీఎంకే.  ఈ రెండు పార్టీలనే ప్రజలు ఎక్కవుగా ఆదరిస్తారు.  రెండు పార్టీల వైపే ప్రజలు మొగ్గు చూపుతారు.  అయితే, ఎన్నికలకు ముందు కమల్ హాసన్ మక్కల్ నీది మయం అనే పార్టీని స్థాపించారు. 

లోక్ సభ ఎన్నికల్లోనూ, 21 శాసనసభ ఉప ఎన్నికల్లోను పోటీ చేశారు.  గట్టి పోటీ ఇవ్వకపోయినా కనీసం కొన్ని స్థానాల్లోనైనా విజయం సాధిస్తారనే నమ్మకం ఉంది.  కానీ, విచిత్రంగా అక్కడ జరిగింది వేరు. కమల్ పార్టీని ప్రజలు ఆదరించలేదు.  ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.  

త్వరలోనే తమిళనాడు ప్రాదేశిక ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని కమల్ కసితో ఉన్నాడు.  ఇప్పటి నుంచే అభ్యర్థులను ఎంపిక చేసి బలం సంస్థాగతంగా బలం పుంజుకోవాలని చూస్తున్నాడు.  ఆంధ్రప్రదేశ్ లో పవన్  పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది. 

మొన్న జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ ఒక్క సీటును మాత్రమే గెలుచుకుంది. త్వరలోనే ఏపీలో ప్రాదేశిక ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల్లో పార్టీ సంస్థాగతంగా బలపడి కొంతమేర ప్రభావం చూపించాలనే కసితో ఉన్నది.  మరి జనసేన పార్టీ బలపడుతుందా చూద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: