తెలుగు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన నేపధ్యంలో ఇరు రాష్ట్రాల మఖ్యమంత్రులు సన్నిహితంగానే ఉంటున్నారు. హైదరబాద్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన భవనాలను కూడా తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించారు. ఇక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్ లను కేంద్రం నియమిస్తుందని పుకార్లు వస్తున్నాయి.

తెలంగాణకు గవర్నర్ గా నరసింహాన్ కొనసాగుతారని, ఆంధ్రప్రదేశ్ కు  మాజీ కేంద్ర మంత్రి సుష్మస్వరాజ్ ను కేంద్రం నియమిస్తున్నట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై భారతీ జనతా పార్టీ ఎంపీ  జీవీఎల్ నరసింహారావు స్పందించారు. సామాజిక మాధ్యమాలు వేదికగా వస్తున్న ఈ వదంతులను నమ్మొద్దని, ఇప్పట్లో నరసింహన్ ను మార్చే యోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటు గురించి ప్రస్తావిస్తూ, 2020 నాటికి  వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.తమ పార్టీలో చేరే వారిపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సేవా భావంతో పార్టీలోకి వస్తానంటే వారిని తప్పకుండా ఆహ్వానిస్తామని చెప్పారు. పార్టీలో అంతర్గత చర్చ జరిగిన తర్వాతే ఆయా పార్టీల నేతలను బీజేపీలో చేర్చుకుంటామని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: