వైఎస్ మృతిచెందిన‌ప్ప‌టి నుంచి నేడు ఏపీలో జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి వ‌ర‌కు సాక్షి దిన‌ప‌త్రిక ఉద్యోగుల‌పై రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్రమైన క‌క్ష‌సాధింపు ధోర‌ణులు, రాజకీయ వేధింపులు కొన‌సాగుతూనే ఉంటున్నాయి. ప‌దేళ్ల‌పాటు ఎన్నోక‌ష్ట‌న‌ష్టాలు ఎదుర్కొన్న వీరి క‌ళ్ల‌ల్లో ఎట్ట‌కేల‌కు ఆనందం తాండ‌వించింది. త‌మ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి సీఎం అవ్వ‌డంతో త‌మ కష్టాలు తీరుతాయ‌ని... త‌మ జీతాలు పెరుగుతాయ‌ని.. త‌మ కుటుంబాల జీవ‌న ప‌రిస్థితి బాగుప‌డుతుంద‌ని అంద‌రూ భావించారు.


ప‌దేళ్ల పాటు సాక్షి ఉద్యోగులు ఎన్నో క‌ష్ట‌న‌ష్టాలు ఎదుర్కొన్నా జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే త‌మ బ‌తుకులు బాగుప‌డ‌తాయ‌న్న ఆశ‌తో వాళ్లు ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి కుటుంబం కూడా ఈ ప‌త్రిక‌ను చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని న‌డిపించింది. జ‌గ‌న్ సీఎం అయిన వెంట‌నే ఆశా వ‌ర్క‌ర్ల‌కు, సామాజిక ఫెన్ష‌న్ దారుల‌కు, ప్రభుత్వ ఉద్యోగుల‌కు వాళ్లు ఊహించిన దానిక‌న్నా భారీ ఎత్తున ఇంక్రిమెంట్లు వేయ‌డంతో పాటు జీతాలు పెంచుతున్నారు. 


ఇక పదేళ్ల పాటు సాక్షి కష్టాల్లో ఉండడంతో ఆ సంస్థ ఉద్యోగుల జీతభత్యాలు చాలా స్వల్ప స్థాయిలో మాత్రమే పెరిగాయి. ముఖ్యంగా జిల్లా స్థాయి రిపోర్టర్లు, డెస్క్‌లో పనిచేసే ఉద్యోగుల జీతభత్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి అన్న టాక్ మీడియా సర్కిల్స్‌లో నడుస్తూ వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం అవ్వడంతో సాక్షి ఉద్యోగుల‌ జీతాలు పెంపుపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. అయితే సాక్షి మేనేజ్మెంట్ కేవలం 6.5 శాతం వృద్ధిరేటుతో జీతాలు పెంచాలని ఫిక్స్ అయింది. ఈ మేటర్ బయటకు రావడంతో పదేళ్లపాటు ఓ మోస్త‌రు విజేతలకు పనిచేస్తున్న సీనియర్లందరూ తీవ్ర నిరాశతో ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.


వాస్తవానికి సాక్షి మీడియా లో ఏం జరుగుతుందో జగన్ కు గాని... ఆయన కుటుంబానికి గానీ పూర్తిగా తెలియదు. సాక్షి బాధ్యతలు వేరే వాళ్లకు అప్పగించారు. అయితే వారు ఉద్యోగుల పరిస్థి, ప‌దేళ్ల పాటు వారి క‌ష్టాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు పడడంతో వాళ్ల ఇంక్రిమెంట్లు తక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు జగన్ అధికారంలోకి రావడంతో తమ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతోందని ఆశించిన వారి ఆశలు అడియాశలు అయ్యాయి. దీంతో కొందరు సీనియర్లు తమ ఆవేదనను సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్నారు. ఈ పోస్టులు మీడియా సర్కిల్స్ లో బాగా అయ్యాయి.


జీతాలు స్వల్పంగా పెరగడంతో సాక్షి ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వార్తలు చివరకు మేనేజ్మెంట్ వరకు వెళ్లాయి. దీంతో కొందరు సాక్షి కీలక వ్యక్తులు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసినట్టుగా తెలుస్తోంది. దీంతో జగన్ సాక్షిలో కీల‌క వ్య‌క్తుల‌తో వాళ్లు కూడా కష్టపడ్డారు... కొంచెం మంచిగా చూసుకోండి అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. వర్గాల సమాచారం మేరకు సాక్షిలో ఇంక్రిమెంట్లు ముందు వేసిన 6.5 శాతం కంటే కాస్త ఎక్కువే ఉండ‌బోతున్నాయ‌ని స‌మాచారం. ఇక సాక్షి ఉద్యోగుల‌కు కూడా జ‌గ‌న్ ఆఫ‌ర్‌తో ఫుల్ ఖుషీ వ‌చ్చేసిన‌ట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి: