మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నిన్నటి వరకూ ఓ వెలుగు వెలిగిన నాయకుడు. మాజీ మంత్రిగా మారిపోయారు. అధికారాంతమున అన్ని వెలుగులు మలిగిన వేళ గంటా వారు ఫుల్ సైలెంట్ ఐపోయారు. అయిదేళ్ళ పాటు టీడీపీని నడిపించే బాధ్యతను మాజీ మంత్రి హోదాలో ఆయన మోయడానికి రెడీనా


అంటే ఆయన పోకడలు మాత్రం నో అంటున్నాయి. గంటా గత కొన్నాళ్ళుగా సైలెంట్ మూడ్ లో ఉన్నారు. అధికారం లేకపోతే మనలేరని మాజీ మంత్రికి పేరుంది. నిజానికి ఆయన వైసెపీలోకి రావాలి కానీ అక్కడ నో ఎంట్రీ బోర్డ్ వేలాడుతోంది. ఇక బీజేపీ వైపు ఆయన చూస్తున్నారని అంటున్నారు.


గంటాను టీడీపీ అధినాయకత్వం  పట్టించుకోవడంలేదా లేక ఆయన అలా ఉంటున్నారా అన్నది కూడా చర్చగా ఉంది. టీడీపీ ముగ్గురు ఉప నాయకులను నియ‌మిస్తే అందులో గంటా పేరు లేదు. ఆయన బాబుకు సన్నిహితులు మరి బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన గంటాను ఉప నాయకునిగా ఎందుకు పెట్టలేదన్న మాట వినిపిస్తోంది. గంటా రూట్ సెపరేట్ అని హై కమాండ్ కి కూడా డౌట్ వచ్చిందా అన్నదే పెద్ద డౌట్.


మరింత సమాచారం తెలుసుకోండి: