ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యూపీ ప్రభుత్వం ప్రజా సమస్యలపై పనిచేసే బదులు రాష్ట్రంలోని రైతులు, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు.

జర్నలిస్టు ప్రశాంత్ కనోజియాను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన కొద్ది సేపటికే ప్రియాంక ఈ మేరకు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇవాళ ట్విటర్ వేదికగా ప్రియాంక స్పందిస్తూ ప్రజల సమస్యలపై పనిచేయడానికి బదులు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులు, రైతులు, వారి ప్రతినిధులను భయభ్రాంతులకు గురి చేస్తోందని పేర్కొన్నారు.

కాగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సైతం ఇదే తరహాలో స్పందించిన సంగతి తెలిసిందే. తప్పుడు వార్తలు రాసిన వారిని జైల్లో పెడతామంటున్న ప్రభుత్వం.. బీజేపీ, ఆరెస్సెస్ ప్రోద్బలంతో నాపై తప్పుడు వార్తలు రాస్తున్న వారిని కూడా జైల్లో పెట్టాలి.

అదే జరిగితే చాలా పత్రికలు, చానెళ్లలో జర్నలిస్టులకు తీవ్ర కొరత ఏర్పడుతుంది. యూపీ సీఎం మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. అరెస్టైన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని ప్రియాంక డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: